ఇండో-పాక్ ఫోర్స్ ఎంతెంత?
భారత అమ్ములపొదిలో 60 అణుబాంబులు పాక్ ఆయుధాగారంలో 25 అణుబాంబులు భారత్ మిలిటరీ వ్యయం 13.8 బిలియన్ డాలర్లు పాక్ మిలిటరీ ఖర్చు 2.7 బిలియన్ డాలర్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేయడంతో… ఇండో-పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. దాయాది దేశాలు గగన తల యుద్ధం కోసం తహతహలాడుతున్నాయి. మిరాజ్ ల దాడి ఖర్చు కోటీ 70 లక్షలు… భారత ఫైటర్ జెట్ మిరాజ్ ల దాడిలో…పాక్ […]
- భారత అమ్ములపొదిలో 60 అణుబాంబులు
- పాక్ ఆయుధాగారంలో 25 అణుబాంబులు
- భారత్ మిలిటరీ వ్యయం 13.8 బిలియన్ డాలర్లు
- పాక్ మిలిటరీ ఖర్చు 2.7 బిలియన్ డాలర్లు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేయడంతో… ఇండో-పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. దాయాది దేశాలు గగన తల యుద్ధం కోసం తహతహలాడుతున్నాయి.
మిరాజ్ ల దాడి ఖర్చు కోటీ 70 లక్షలు…
మొత్తం 12 మిరాజ్ జెట్ ఫైటర్లు, మూడు సుఖోయ్ గస్తీ విమానాలతో…..కేవలం 20 నిముషాల ఈ ఆపరేషన్ కోసం….భారత వైమానిక దళం 6 వేల 568 కోట్ల ఖరీదైన విమానాలను ఉపయోగించాల్సి వచ్చింది.
700 కోట్ల ఫైటర్ కూల్చివేత….
భారత్ మెరుపుదాడులతో కంగుతిన్న పాకిస్థాన్ సైతం ప్రతిదాడికి ప్రయత్నించి…ఇప్పటికే 700 కోట్ల రూపాయల విలువైన F-16 ఫైటర్ జెట్ విమానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. భారత్ లోని రెండు సెక్టార్ల గగనతలంలోకి పాక్ ఫైటర్ జెట్లు చొరబడటానికి చేసిన ప్రయత్నాలను.. భారత గస్తీ దళ సుఖోయ్ విమానాలు వమ్ము చేశాయి. శత్రు దేశానికి చెందిన ఫైటర్ విమానాలను తరిమితరిమి కొట్టాయి.
తమ గగనతలంలోకి పలాయనం చిత్తగించే సమయంలో….పాకిస్థాన్ కు చెందిన ఓ F-16 ఫైటర్ జెట్ విమానాన్ని భారత దళం కూల్చి వేసింది.
ఇప్పటికే … భారత ప్రభుత్వం …అమెరికాతో సహా ప్రపంచ దేశాల మద్ధతును కూడగట్టడం ద్వారా ఓవైపు నైతిక విజయం సాధిస్తే… మరోవైపు… టెర్రరిస్థాన్ పాకిస్థాన్ మాత్రం దుస్సాహసానికి ఉవ్విళూరుతోంది.
భారత్ సరిహద్దుల్లో చొరబాటుకు… అమెరికా దానం చేసిన అత్యాధునిక F-16 ఫైటర్ జెట్ విమానాలను ఉపయోగిస్తోంది.
భారత్ విమానదళంలో 2వేల విమానాలు…
భారత వైమానికదళంలో.. ఫ్రాన్స్ లో తయారైన మిరాజ్, రష్యా తయారు చేసిన సుఖోయ్, మిగ్ ఫైటర్ జెట్ విమానాలు…ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. ఇక…పాక్ వైమానిక దళానికి … F-16 ఫైటర్ జెట్ విమానాల బలగం మాత్రమే ఉంది.
అంతేకాదు..భారత్ ఆయుధాగారంలో 60 అణుబాంబులు ఉంటే…పాకిస్థాన్ ఆయుధాగారంలో 25 అణుబాంబుల వరకూ ఉన్నాయి.
భారత్ ముందు పాక్ దిగదుడుపే…
130 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత మిలిటరీ వ్యయం 13.8 బిలియన్ డాలర్లుగా ఉంటే…. ప్రపంచంలోని అత్యంత బీదదేశాలలో ఒకటైన పాకిస్థాన్ మాత్రం… 2.7 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తోంది.
ఇక..సైనికదళాల సంఖ్యలో సైతం భారత్ తో పాకిస్థాన్ కు ఏమాత్రం పోలికే లేదు. భారత్ కు కోటీ 32 లక్షల సైనికుల బలగం ఉంటే…పాక్ కు 6 లక్షల 20వేల సైనిక బలగాలు ఉన్నాయి.
అణుయుద్ధంతో వినాశనమే!
ఏదిఏమైనా…జనాభా, సైనికదళాల పరంగా చూస్తే…పొరుగుదేశం పాకిస్థాన్ కంటే భారత్ ఎన్నో రెట్లు బలమైన శక్తిగా ఉంది. అయితే…రెండుదేశాల చేతిలోనూ అణ్యాయుధాలు ఉండటంతో… ఒకవేళ యుద్ధమే జరిగితే విజేత అంటూ ఉండరని…చివరకు మిగిలేది మానవాళి విధ్వంసమేనని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.