క్షమాపణలు చెప్పిన రాహుల్ రామకృష్ణ

ఒకప్పట్లా సినిమా రిజల్ట్ పై నటీనటులు మొహమాటాలకు పోవడం లేదు. ఆడితే హిట్ అంటున్నారు, ఆడకపోతే ఫ్లాప్ అంటూ ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు. కుర్ర హీరోల నుంచి ఇప్పుడిప్పుడే స్టార్స్ కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకుంటున్నారు. ఫ్లాప్ అయినా తమ సినిమా ఆణిముత్యం అని చెప్పుకునే రోజులు పోయాయిప్పుడు. మొన్నటికిమొన్న నోటా సినిమా ఫ్లాప్ అయితే స్వయంగా ఆ పరాజయాన్ని ఒప్పుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అంతెందుకు, రీసెంట్ గా వినయ విధేయ రామ ఫ్లాప్ […]

Advertisement
Update:2019-02-23 11:23 IST

ఒకప్పట్లా సినిమా రిజల్ట్ పై నటీనటులు మొహమాటాలకు పోవడం లేదు. ఆడితే హిట్ అంటున్నారు, ఆడకపోతే ఫ్లాప్ అంటూ ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు. కుర్ర హీరోల నుంచి ఇప్పుడిప్పుడే స్టార్స్ కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకుంటున్నారు. ఫ్లాప్ అయినా తమ సినిమా ఆణిముత్యం అని చెప్పుకునే రోజులు పోయాయిప్పుడు.

మొన్నటికిమొన్న నోటా సినిమా ఫ్లాప్ అయితే స్వయంగా ఆ పరాజయాన్ని ఒప్పుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అంతెందుకు, రీసెంట్ గా వినయ విధేయ రామ ఫ్లాప్ అయితే క్షమించండంటూ రామ్ చరణ్ బహిరంగ లేఖ విడుదల చేశాడు. ఇప్పుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా అదే పని చేశాడు.

రాహుల్, ప్రియదర్శి కలిసి చేసిన మిఠాయి సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఒక రోజైనా గడవకముందే రాహుల్ రామకృష్ణ ఈ విషయాన్ని అంగీకరించాడు. తామెంతో కష్టపడినా సినిమా ఫ్లాప్ అయిందని, సరిగ్గా ఎంటర్ టైన్ చేయనందుకు ప్రేక్షకులు తమను మన్నించాలంటూ ట్వీట్ పెట్టాడు. అయినా సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం తనకు ముందే తెలుసని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారం చేశామని రాసుకొచ్చాడు.

#mithai

Posted by Rahul Ramakrishna on Thursday, 17 January 2019

Tags:    
Advertisement

Similar News