గర్భంతో ఉన్న సమయంలో కలిగే అపోహలు.... అసలు నిజాలు !

ఆడవాళ్ల జీవితంలో తల్లి కావడం అనేది చాలా ఆనందకరమైన సందర్భం. ఆ తొమ్మిది నెలల కాలం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తల్లితో పాటు బిడ్డ ఎదుగుదల ముఖ్యం కాబట్టి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే గర్భంతో ఉన్న సమయంలో కొన్ని విషయాల్లో అపోహలు ఉన్నాయి. అవి ఎంత వరకు నిజమో మనం తెలుసుకుందాం. అపోహ : గర్భంతో ఉన్న వారి పొట్ట పరిమాణాన్ని బట్టి శిశువు లింగ నిర్థారణ చేయవచ్చు. అబ్బాయైతే చిన్నగానూ.. అమ్మాయైతే పెద్దగానూ ఉంటుంది..! […]

Advertisement
Update:2019-02-18 02:19 IST

ఆడవాళ్ల జీవితంలో తల్లి కావడం అనేది చాలా ఆనందకరమైన సందర్భం. ఆ తొమ్మిది నెలల కాలం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తల్లితో పాటు బిడ్డ ఎదుగుదల ముఖ్యం కాబట్టి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే గర్భంతో ఉన్న సమయంలో కొన్ని విషయాల్లో అపోహలు ఉన్నాయి. అవి ఎంత వరకు నిజమో మనం తెలుసుకుందాం.

అపోహ : గర్భంతో ఉన్న వారి పొట్ట పరిమాణాన్ని బట్టి శిశువు లింగ నిర్థారణ చేయవచ్చు. అబ్బాయైతే చిన్నగానూ.. అమ్మాయైతే పెద్దగానూ ఉంటుంది..!

నిజం : పొట్ట పరిమాణం, ఆకారం కేవలం తల్లి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి పెరుగుతుంది. పొట్ట కండర నిర్మాణం, కొవ్వు శాతాన్ని బట్టి.. గర్బంలో పెరుగుతున్న శిశువుల సంఖ్యను బట్టి మారుతుంది. దీనికి శిశువు లింగానికి సంబంధమే లేదు.

అపోహ : తల్లి యొక్క ముఖ వచ్చస్సును బట్టి పుట్టబోయేది ఆడా లేదా మగ అని తెలుసుకోవచ్చు. ఆడపిల్ల అయితే కాంతివంతమైన ముఖం, మగ పిల్లవాడు అయితే కొంచెం కాంతి విహీనంగా ఉండే ముఖం ఉంటుంది.

నిజం : ప్రతీ స్త్రీ ముఖం గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి కాంతివంతంగా మారుతుంది. మూడో నెల వరకు ఉండే వికారం, చికాకు వంటివి తగ్గిపోతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి ఆహారం ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తారు. శరీరంలో రక్త ప్రసరణ పెరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది. దీనికి శిశువు లింగానికి సంబంధం లేదు.

అపోహ : తల్లికి గుండెల్లో మంటగా ఉంటే శిశువు తలపై ఒత్తైన జుట్టు ఉందని అర్థం.

నిజం : గుండెల్లో మంటకు, శిశువు జుట్టుకు సంబంధం లేదు. సాధారణంగా గర్బంతో ఉన్న సమయంలో తీసుకునే ఆహారం త్వరగా అరగక.. జీర్ణాశయంలోని ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవేశించి త్రేన్పులు రావడం మంటగా అనిపించడం జరుగుతుంది. దీన్నే గుండెల్లో మంటగా ఉండటం అన్నారు. అంతే కాని శిశువు జుట్టుతో దీనికి సంబంధం లేదు.

అపోహ : గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే కాన్పు సమయంలో ఇబ్బంది అవుతుంది.

నిజం : గర్భంతో ఉన్న సమయంలో శృంగారంలో పాల్గొనడం సురక్షితమే. డాక్టర్లు వద్దు అని చెప్పిన సందర్భంలో తప్ప తల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుంటే నిరభ్యంతరంగా శృంగారంలో పాల్గొనవచ్చు. దీని వల్ల శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదు. కొంత మంది చివరి నెల వరకు శృంగారంలో పాల్గొంటుంటారు.

అపోహ : వంశ చరిత్రను బట్టే కాన్పు ఎలా జరుగుతుంతో నిర్థారించబడుతుంది.

నిజం : తల్లిదండ్రుల వంశ చరిత్రతో కాన్పునకు సంబంధం లేదు. సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ అనేది కేవలం తల్లికి అది ఎన్నో కాన్పు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు బిడ్డ గర్బంలో ఏ పొజిషన్‌లో ఉంది, తల్లి పెల్విక్ బోన్ నిర్మాణం ఎలా ఉంది.. గర్భంలో కవలలు ఉన్నారా వంటి విషయాలు కాన్పు పద్దతిని నిర్ణయిస్తాయి.

Tags:    
Advertisement

Similar News