స్పోర్ట్స్ అధారటీ ఆఫ్ ఇండియా ఇక స్పోర్ట్స్ ఇండియా
1984 నుంచి భారత క్రీడాప్రాధికార సంస్థ కార్యకలాపాలు ఏడాదికి 481 కోట్ల రూపాయల నిధులతో సాయి నిర్వహణ భారత క్రీడాభివృద్ధిలో స్పోర్ట్స్ అథారటీ ఎనలేని పాత్ర భారత క్రీడారంగానికి గత మూడుదశాబ్దాలుగా… చిరునామాగా నిలిచిన భారత క్రీడాప్రాధికార సంస్థ… స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా పేరు మారింది. ఇక నుంచి…. స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియాను…. స్పోర్ట్స్ ఇండియాగా మార్చినట్లు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశంలో క్రీడారంగ అభివృద్ధి , ప్రమాణాలు మెరుగుపరచడం కోసం…. […]
- 1984 నుంచి భారత క్రీడాప్రాధికార సంస్థ కార్యకలాపాలు
- ఏడాదికి 481 కోట్ల రూపాయల నిధులతో సాయి నిర్వహణ
- భారత క్రీడాభివృద్ధిలో స్పోర్ట్స్ అథారటీ ఎనలేని పాత్ర
భారత క్రీడారంగానికి గత మూడుదశాబ్దాలుగా… చిరునామాగా నిలిచిన భారత క్రీడాప్రాధికార సంస్థ… స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా పేరు మారింది.
ఇక నుంచి…. స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియాను….
స్పోర్ట్స్ ఇండియాగా మార్చినట్లు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశంలో క్రీడారంగ అభివృద్ధి , ప్రమాణాలు మెరుగుపరచడం కోసం…. 1961లోనే ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు.
అయితే …. 1984 నుంచి మాత్రమే స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియాగా నామకరణం చేశారు. ఏడాదికి 481 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ తో….క్రీడాభివృద్ధిలో పాలుపంచుకొంటూ వస్తోంది.
స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా పేరును మార్చాలంటూ చేసిన ప్రతిపాదనను…అధికారులు అధికారికంగా ఆమోదించారు. కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిర్ణయం తీసుకొంది.
స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా పేరు మార్చినట్లుగా పంపిన సమాచారాన్ని…. రిజిష్ట్రార్ ఆఫ్ సొసైటీస్ ఆమోదించాల్సి ఉంది.