శిఖా చౌదరి చెప్పింది అబద్దాలే.... బయటపడ్డ ఆధారాలు
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు మొదలుపెట్టారు. పీటీ వారెంట్‌పై నిందితుడు రాకేష్ రెడ్డిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జయరాం భార్య పద్మశ్రీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారు. మరోవైపు తొమ్మిది నెలలుగా రాకేష్ రెడ్డితో తనకు సంబంధాలు లేవంటూ శిఖా చౌదరి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని పోలీసులు భావిస్తున్నారు. తొమ్మిది నెలల నుంచి రాకేష్ రెడ్డితో తాను కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని పోలీసులతో పాటు మీడియా వద్ద కూడా శిఖాచౌదరి చెప్పారు. అయితే రాకేష్ […]
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు మొదలుపెట్టారు. పీటీ వారెంట్‌పై నిందితుడు రాకేష్ రెడ్డిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జయరాం భార్య పద్మశ్రీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారు.
మరోవైపు తొమ్మిది నెలలుగా రాకేష్ రెడ్డితో తనకు సంబంధాలు లేవంటూ శిఖా చౌదరి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని పోలీసులు భావిస్తున్నారు. తొమ్మిది నెలల నుంచి రాకేష్ రెడ్డితో తాను కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని పోలీసులతో పాటు మీడియా వద్ద కూడా శిఖాచౌదరి చెప్పారు. అయితే రాకేష్ రెడ్డి, శిఖాచౌదరి అత్యంత సన్నిహితంగా ఇటీవలే దిగిన
ఫొటోలు బయటకు వచ్చాయి.
శిఖాచౌదరి నడుము మీద రాకేష్ రెడ్డి చేయి వేసుకుని ఉండగా… రాకేష్ రెడ్డిని హత్తుకుని అతడి పొట్టపై శిఖాచౌదరి చేయి వేసి దిగిన ఫొటో బయటకు వచ్చింది. ఇటీవలే వీరిద్దరు ఈ ఫొటో దిగారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే శిఖాచౌదరి, రాకేష్ రెడ్డి ఇద్దరూ దుబాయ్‌కు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు.
కేవలం హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే తొమ్మిది నెలలుగా రాకేష్ రెడ్డితో తనకు సంబంధాలు లేవని శిఖా చౌదరి చెబుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాకేశ్ రెడ్డితో తనకు వ్యాపార పరిచయాలే తప్ప అంతకు మించి ఏమీ లేదు అని చెప్పిన మాటలు కూడా తాజాగా బయటకు వచ్చిన ఫొటోను బట్టి అబద్దాలేనని తెలుస్తోంది. ఈ కోణంలోనే తెలంగాణ పోలీసులు కేసును దర్యాప్తు చేయబోతున్నారు.