కలిసిరాని పాత్రలో రామ్ చరణ్

పోలీసాఫీసర్ క్యారెక్టర్.. సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ చొక్కా చాలామందికి కలిసొచ్చింది. కానీ రామ్ చరణ్ తేజ్ కు మాత్రం ఇదొక పీడకల. తెలుగు-హిందీ భాషల్లో చరణ్ చేసిన జంజీర్ (తెలుగులో తుపాన్) సినిమా పెద్ద అట్టర్ ఫ్లాప్. అందులో రామ్ చరణ్ సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా దెబ్బకు ఆ టైపు పాత్రలకు దూరమయ్యాడు చరణ్. మళ్లీ ఇన్నాళ్లకు ఖాకీ చొక్కాపై మనసుపడ్డాడు ఈ హీరో. అవును.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్-ఆర్-ఆర్ […]

Advertisement
Update:2019-02-08 03:10 IST

పోలీసాఫీసర్ క్యారెక్టర్.. సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ చొక్కా చాలామందికి కలిసొచ్చింది. కానీ రామ్ చరణ్ తేజ్ కు మాత్రం ఇదొక పీడకల. తెలుగు-హిందీ భాషల్లో చరణ్ చేసిన జంజీర్ (తెలుగులో తుపాన్) సినిమా పెద్ద అట్టర్ ఫ్లాప్. అందులో రామ్ చరణ్ సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా దెబ్బకు ఆ టైపు పాత్రలకు దూరమయ్యాడు చరణ్. మళ్లీ ఇన్నాళ్లకు ఖాకీ చొక్కాపై మనసుపడ్డాడు ఈ హీరో.

అవును.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టులో రామ్ చరణ్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొన్నటివరకు చెర్రీ బాక్సర్ గా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా పోలీస్ గెటప్ లో చరణ్ అనే మాట వినిపిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ ఈ సినిమాలో ముస్లిం యువకుడిగా కనిపించబోతున్నాడట.

ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య రామ్ చరణ్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ పిక్చరైజ్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. హీరోయిన్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Tags:    
Advertisement

Similar News