మాస్టర్-బ్లాస్టర్ ల వన్డే రికార్డు తెరమరుగు
రెండో వన్డే లో టీమిండియా ఓపెనర్ల సరికొత్త రికార్డు సచిన్- సెహ్వాగ్ ల భాగస్వామ్యాల రికార్డు తెరమరుగు 95 ఇన్నింగ్స్ లో 13 సెంచరీ భాగస్వామ్యాల రోహిత్- ధావన్ మొదటి వికెట్ కు 25.2 ఓవర్లలో 154 పరుగుల భాగస్వామ్యం న్యూజిలాండ్ తో రెండో వన్డేలో టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శిఖర్ ధావన్..మొదటి వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు. మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర […]
- రెండో వన్డే లో టీమిండియా ఓపెనర్ల సరికొత్త రికార్డు
- సచిన్- సెహ్వాగ్ ల భాగస్వామ్యాల రికార్డు తెరమరుగు
- 95 ఇన్నింగ్స్ లో 13 సెంచరీ భాగస్వామ్యాల రోహిత్- ధావన్
- మొదటి వికెట్ కు 25.2 ఓవర్లలో 154 పరుగుల భాగస్వామ్యం
న్యూజిలాండ్ తో రెండో వన్డేలో టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శిఖర్ ధావన్..మొదటి వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.
మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్ ల పేరుతో ఉన్న రికార్డును రోహిత్-ధావన్ జోడీ అధిగమించారు. సచిన్- వీరూ జోడీ 114 ఇన్నింగ్స్ లో సాధించిన 13 సెంచరీ స్టాండ్ ల రికార్డును…కేవలం 95 ఇన్నింగ్స్ లోనే రోహిత్- ధావన్ జంట అధిగమించడం విశేషం.
భారత క్రికెట్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డు సచిన్- సౌరవ్ గంగూలీ జోడీ పేరుతో ఉంది. ఈ ఇద్దరూ 26 సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయటం విశేషం.
2013 సీజన్లో తొలిసారిగా రోహిత్- ధావన్ జోడీ టీమిండియా వన్డే ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి నిలకడగా రాణిస్తూ పరుగుల మోత మోగిస్తూ వస్తున్నారు.
ప్రస్తుత సిరీస్ రెండో వన్డేలో ఈ ఇద్దరూ కేవలం 25.2 ఓవర్లలోనే 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
రోహిత్ 96 బాల్స్ లో 3 సిక్సర్లు, 9 బౌండ్రీలతో 87 పరుగులు, శిఖర్ ధావన్ 67 బాల్స్ లో 9 బౌండ్రీలతో 66 పరుగులు సాధించి అవుటయ్యారు.