దాసరి విగ్రహావిష్కరణలో వివాదం....

పాలకొల్లులో కేంద్ర మాజీ మంత్రి, దర్శక రత్న దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణలో వివాదం నెలకొంది. విగ్రహ ఏర్పాట్లుకు పార్టీలకతీతంగా అందరూ చందాలు ఇచ్చారు. కానీ కార్యక్రమాన్ని టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హైజాక్‌ చేశారని టీడీపీ నేతలతో పాటు, మాజీ మంత్రి హరిరామజోగయ్య మండిపడుతున్నారు. విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎంపీ తోట సీతారామలక్ష్మీల పేర్లను కూడా ముద్రించలేదు. కేవలం ఎమ్మెల్యే , మంత్రులు తమ పేర్లతో ఆహ్వాన పత్రాలు […]

Advertisement
Update:2019-01-26 09:25 IST

పాలకొల్లులో కేంద్ర మాజీ మంత్రి, దర్శక రత్న దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణలో వివాదం నెలకొంది. విగ్రహ ఏర్పాట్లుకు పార్టీలకతీతంగా అందరూ చందాలు ఇచ్చారు. కానీ కార్యక్రమాన్ని టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హైజాక్‌ చేశారని టీడీపీ నేతలతో పాటు, మాజీ మంత్రి హరిరామజోగయ్య మండిపడుతున్నారు.

విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎంపీ తోట సీతారామలక్ష్మీల పేర్లను కూడా ముద్రించలేదు. కేవలం ఎమ్మెల్యే , మంత్రులు తమ పేర్లతో ఆహ్వాన పత్రాలు ముద్రించుకున్నారు. దీంతో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.

టీడీపీ ఎమ్మెల్యే తీరుపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య మండిపడ్డారు. తాను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పారు. విగ్రహ ఏర్పాటుకు అందరూ విరాళాలు ఇచ్చారని… స్థానిక ఎమ్మెల్యే అన్న గౌరవంతో నిమ్మల రామానాయుడిని ముందుంచితే ఏకంగా కార్యక్రమాన్ని టీడీపీ కార్యక్రమంగా మార్చేశారని విమర్శించారు. విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రం … టీడీపీ పోస్టర్‌ తరహాలో ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే ఆహ్వానపత్రంలో ఉన్నాయని హరిరామజోగయ్య విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News