వాహనదారులకు బిగ్ రిలీఫ్....
దేశ వ్యాప్తంగా త్వరలోనే టోల్ ప్లాజాలు మాయం కాబోతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఆగి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. పండుగ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించాల్సిన అవసరం లేదు. టోల్ ప్లాజాలను ఎత్తివేసి వాటి స్థానంలో పన్ను వసూలుకు కొత్త పద్దతిని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టబోతోంది. ఈ పద్దతిలో వాహనానికి ఆన్ బోర్డు యూనిట్‌ను అమరుస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో ఈ పరికరం […]
దేశ వ్యాప్తంగా త్వరలోనే టోల్ ప్లాజాలు మాయం కాబోతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఆగి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. పండుగ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించాల్సిన అవసరం లేదు. టోల్ ప్లాజాలను ఎత్తివేసి వాటి స్థానంలో పన్ను వసూలుకు కొత్త పద్దతిని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టబోతోంది.
ఈ పద్దతిలో వాహనానికి ఆన్ బోర్డు యూనిట్‌ను అమరుస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో ఈ పరికరం పనిచేస్తుంది. దీని ద్వారా ప్రయాణం ముగియగానే ఆటోమెటిక్‌గా వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి సంబంధిత ఫీజు కట్ అవుతుంది. ఢిల్లీ- ముంబై హైవేపై ఇప్పటికే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఆ వెంటనే దేశవ్యాప్తంగా ఈ పద్దతి కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.