పాత ఉద్యోగం మూడేళ్ల ముచ్చటే....

భారతీయ యువ ఉద్యోగులు కిక్‌ కోరుకుంటున్నారు. కిక్ సినిమాలో రవితేజలాగే ఎక్కువ కాలం ఒకే చోట ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మూడేళ్లకొకసారి కొత్త చోటికి తరలిపోయేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగాల సెర్చ్ ఇంజన్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో ఇది తేలింది. భారతీయ ఉద్యోగుల్లో 56 శాతం మంది పదేళ్ల కాలంలో మూడుసార్లు ఉద్యోగాలు మారారు. 60 శాతం మంది ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ఎక్కువ మంది మూడేళ్లకే కొత్త ఉద్యోగానికి మారిపోతున్నారు. మెరుగైన […]

Advertisement
Update:2019-01-25 03:26 IST

భారతీయ యువ ఉద్యోగులు కిక్‌ కోరుకుంటున్నారు. కిక్ సినిమాలో రవితేజలాగే ఎక్కువ కాలం ఒకే చోట ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మూడేళ్లకొకసారి కొత్త చోటికి తరలిపోయేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఉద్యోగాల సెర్చ్ ఇంజన్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో ఇది తేలింది. భారతీయ ఉద్యోగుల్లో 56 శాతం మంది పదేళ్ల కాలంలో మూడుసార్లు ఉద్యోగాలు మారారు. 60 శాతం మంది ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ఎక్కువ మంది మూడేళ్లకే కొత్త ఉద్యోగానికి మారిపోతున్నారు. మెరుగైన ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కిక్ లేని చోట పనిచేసేందుకు ఏమాత్రం భారతీయ యువత ఇష్టపడడం లేదు. ఉద్యోగం తమ అంచనాలను అందుకోవడం లేదని 30 శాతం మంది, పనిచేసే ప్రదేశం అనుకూలంగా లేదని 29 శాతం మంది, మెరుగైన ఉద్యోగం వస్తోందన్న ఉద్దేశంతో 38 శాతం మంది పాత ఉద్యోగాలను వదిలేస్తున్నారు.

పలు చోట్ల పనిచేశామన్న రికార్డు రెస్యూమ్‌లో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతోనూ చాలా మంది ఉద్యోగాలు మారుతున్నారు. కొత్త ప్రపంచం, కొత్త నైపుణ్యం, కొత్త మనుషుల మధ్య జాబ్ చేస్తే ఆ అనుభవం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో 49 శాతం మంది ఉద్యోగులు మార్పు కోరుకుంటున్నారు. కంపెనీలు మాత్రం ఉద్యోగుల తీరుకు భిన్నంగా స్పందిస్తున్నాయి.

Advertisement

Similar News