ఓటమిని సహించలేకపోతున్న రేవంత్.... మరో ప్రయత్నం....

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి…అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల తర్వాత బయటకు వచ్చేందుకు కూడా ఆయన పెద్దగా ఇష్టపడడం లేదు. మరో రెండేళ్ల వరకు మీడియాతో కూడా మాట్లాడబోనని ఆ మధ్య ప్రకటించారు. అయితే సొంత నియోజకవర్గంలో తాను ఓడిపోవడాన్ని రేవంత్ రెడ్డి నమ్మకలేకపోతున్నారు. ఏదో జరిగిందన్న అనుమానం ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన నరేందర్‌ […]

Advertisement
Update:2019-01-24 09:46 IST

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి…అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల తర్వాత బయటకు వచ్చేందుకు కూడా ఆయన పెద్దగా ఇష్టపడడం లేదు. మరో రెండేళ్ల వరకు మీడియాతో కూడా మాట్లాడబోనని ఆ మధ్య ప్రకటించారు.

అయితే సొంత నియోజకవర్గంలో తాను ఓడిపోవడాన్ని రేవంత్ రెడ్డి నమ్మకలేకపోతున్నారు. ఏదో జరిగిందన్న అనుమానం ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి.

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన నరేందర్‌ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకు సంబంధించిన పలు పత్రాలను కోర్టు ముందుంచారు రేవంత్. వాటి ఆధారంగా నరేందర్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టును కోరారు.

Tags:    
Advertisement

Similar News