రాధా అదే తప్పు చేశారా?... అప్పట్లో వైఎస్‌ ఏమన్నారు?

విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా పార్టీకి రాజీనామా చేశారు. మరో రెండు మూడు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఆంక్షలు లేని ప్రజాప్రయాణం కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాధా త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని సమాచారం. అయితే రాధా సరిగ్గా ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయాలు బెడిసికొడుతుంటాయన్న అభిప్రాయం ఉంది. గతంలో 2009లో పీఆర్పీని స్ధాపించినప్పుడు వంగవీటి రాధా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. చిరంజీవి పార్టీ పెట్టగానే సామాజికవర్గం […]

Advertisement
Update:2019-01-21 04:45 IST

విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా పార్టీకి రాజీనామా చేశారు. మరో రెండు మూడు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఆంక్షలు లేని ప్రజాప్రయాణం కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

రాధా త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని సమాచారం. అయితే రాధా సరిగ్గా ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయాలు బెడిసికొడుతుంటాయన్న అభిప్రాయం ఉంది. గతంలో 2009లో పీఆర్పీని స్ధాపించినప్పుడు వంగవీటి రాధా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. చిరంజీవి పార్టీ పెట్టగానే సామాజికవర్గం ఒత్తిడితో పీఆర్పీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి… పిలిపించుకుని ”పార్టీ మారవద్దు.. తిరిగి మనమే అధికారంలోకి వస్తున్నాం. ఈసారి మంత్రి పదవి కూడా నీకు వస్తుంది” అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ రాధా వినిపించుకోకుండా పీఆర్పీలో చేరారు. ఆ పార్టీ తరపున విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి రెండోసారి ఓడిపోయారు. రాధాను వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. కానీ ఆయన ఎందుకో చురుగ్గా పనిచేసేందుకు ఇష్టపడలేదు.

విజయవాడ సెంట్రల్‌లో రాధాకు సానుకూల పరిస్థితి లేదన్న భావనతో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నాయకత్వం సూచించింది. అందుకు విముఖత వ్యక్తం చేసిన రాధా … పార్టీకి రాజీనామా చేశారు. వంగవీటి రంగా హత్య జరిగిన తర్వాతి కాలంలో ఒకసారి రంగా భార్య రత్నకుమారి టీడీపీలో చేరారు.

ఇప్పుడు తనయుడు రాధా కూడా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో చంద్రబాబే తన తండ్రి రంగాను హత్య చేయించారని రాధా బహిరంగ సభల్లోనే ఆరోపించారు.

ఇప్పుడు అదే చంద్రబాబు నాయకత్వంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం ద్వారా పాత విషయాలను మరిచి ముందడుగు వేస్తున్నట్టుగా ఉంది.

Tags:    
Advertisement

Similar News