నెటిజన్ కు ఘాటు రిప్లై.... కానీ....

రకుల్ ప్రీత్ సింగ్ కి గత కొంత కాలంగా చేతిలో సరైన సినిమాలు లేవు. ప్రస్తుతం రకుల్ సినిమాల కంటే కూడా తన బిజినెస్ పై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఇక ఈ నేపథ్యంలో రకుల్ తన ఫిట్నెస్ లెవెల్స్ ని పెంచి ఎప్పటికపుడు సోషల్ మీడియా లో తన ఫొటోస్ పెడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ మధ్య రకుల్  కార్ లో నుంచి దిగుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియా లో తిరుగుతోంది.  ఫొటో […]

Advertisement
Update:2019-01-17 05:57 IST

రకుల్ ప్రీత్ సింగ్ కి గత కొంత కాలంగా చేతిలో సరైన సినిమాలు లేవు. ప్రస్తుతం రకుల్ సినిమాల కంటే కూడా తన బిజినెస్ పై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఇక ఈ నేపథ్యంలో రకుల్ తన ఫిట్నెస్ లెవెల్స్ ని పెంచి ఎప్పటికపుడు సోషల్ మీడియా లో తన ఫొటోస్ పెడుతూ హల్ చల్ చేస్తోంది.

ఈ మధ్య రకుల్ కార్ లో నుంచి దిగుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియా లో తిరుగుతోంది. ఫొటో పై ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. “కారులో సెషన్ అనంతరం ఆమె తన ప్యాంట్ వేసుకోవడం మరచిపోయింది” అని ఓ యువకుడు రకుల్ ని ఉద్దేశించి ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు.

ఇక ఇప్పుడు ఇది రకుల్ దృష్టికి రావడంతో, ఆమె సమాధానం ఇస్తూ, “మీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్లు చాలానే చేసిందేమో… అందుకే నీకు తెలిసింది. ఈ సెషన్ల వివరాల గురించి ఆమెనే అడుగు. అప్పటివరకూ మహిళలకు రక్షణ ఉండదేమో. కేవలం సమానత్వం, రక్షణ అని చర్చలు సాగిస్తే ఉపయోగం ఉండదు” అని కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చింది.

కానీ సోషల్ మీడియా లో జనాలు రకుల్ చేసిన కామెంట్స్ పై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

 

Tags:    
Advertisement

Similar News