నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం

హాస్యబ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ మేరకు బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తండ్రిని ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు మార్చినట్టు ప్రకటించాడు గౌతమ్. కొన్ని రోజులుగా ఛాతికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు బ్రహ్మానందం. అన్ని టెస్టులు చేసిన వైద్యులు, హార్ట్ సర్జరీ చేయించుకుంటే మంచిదని సూచించారు. దీంతో దేశంలో ది బెస్ట్ డాక్టర్లు ఎక్కడెక్కడున్నారో కనుక్కొని, ఫైనల్ గా ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ […]

Advertisement
Update:2019-01-17 12:05 IST

హాస్యబ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ మేరకు బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తండ్రిని ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు మార్చినట్టు ప్రకటించాడు గౌతమ్.

కొన్ని రోజులుగా ఛాతికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు బ్రహ్మానందం. అన్ని టెస్టులు చేసిన వైద్యులు, హార్ట్ సర్జరీ చేయించుకుంటే మంచిదని సూచించారు. దీంతో దేశంలో ది బెస్ట్ డాక్టర్లు ఎక్కడెక్కడున్నారో కనుక్కొని, ఫైనల్ గా ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ను బ్రహ్మానందం ఎంపిక చేసుకున్నారు. డాక్టర్ రమాకాంత్ పాండా…. బ్రహ్మానందంకు విజయవంతంగా గుండె ఆపరేషన్ నిర్వహించారు.

ప్రస్తుతం బ్రహ్మానందం కోలుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు ముంబయిలోనే ఉంటారు. బ్రహ్మానందంకు సర్జరీ అయిందని తెలిసిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులంతా గౌతమ్ కు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News