వన్డే క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన ఘనత

టీమిండియా తరపున 10వేల పరుగుల మైలురాయి చేరిన ధోనీ ఆసీస్ తో సిడ్నీ వన్డేలో 10వేల పరుగులు సాధించిన ధోనీ వన్డేల్లో 10వేల పరుగులు సాధించిన భారత 5వ క్రికెటర్ ధోనీ 282 ఇన్నింగ్స్ లో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ…వన్డే క్రికెట్ 10వేల పరుగుల క్లబ్ లో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియాతో తీన్మార్ సిరీస్ లో భాగంగా…సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ […]

Advertisement
Update:2019-01-12 09:13 IST
  • టీమిండియా తరపున 10వేల పరుగుల మైలురాయి చేరిన ధోనీ
  • ఆసీస్ తో సిడ్నీ వన్డేలో 10వేల పరుగులు సాధించిన ధోనీ
  • వన్డేల్లో 10వేల పరుగులు సాధించిన భారత 5వ క్రికెటర్ ధోనీ
  • 282 ఇన్నింగ్స్ లో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ…వన్డే క్రికెట్ 10వేల పరుగుల క్లబ్ లో చోటు సంపాదించాడు.

ఆస్ట్రేలియాతో తీన్మార్ సిరీస్ లో భాగంగా…సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన తొలివన్డేలో ధోనీ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో 10 వేల పరుగులు సాధించిన భారత ఐదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

ధోనీకి ముందే 10వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ,రాహుల్ ద్రావిడ్, విరాట్ కొహ్లీ ఉన్నారు.

ధోనీ మొత్తం 282 ఇన్నింగ్స్ లో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో సహా 50 సగటు సంపాదించాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ధోనీ గతంలోనే 10 వేల పరుగులు సాధించాడు.

అయితే…2007లో ఆసియా లెవెన్ జట్టులో సభ్యుడిగా ఆడిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో సాధించిన 174 పరుగులను అప్పట్లో చేర్చలేదు.

ఆ తర్వాత ఐసీసీ మినహాయింపు ఇవ్వడంతో కెరియర్ లో 10వేల పరుగుల రికార్డు సాధించినట్లయ్యింది. భారతజట్టు సభ్యుడిగా ఇప్పుడు 10 వేల పరుగుల రికార్డును పూర్తి చేయడం విశేషం.

Tags:    
Advertisement

Similar News