"యాత్ర" ఎవరి మీదకు దండయాత్రో చెప్పిన మూడు డైలాగ్స్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకుని తీస్తున్న ”యాత్ర” చిత్రం ట్రైలర్ విడుదలైంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసిన నేపథ్యంలో…. ఈ చిత్రం కాంగ్రెస్ కు కూడా మైలేజ్ ఇస్తుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కాంగ్రెస్ పాత్రను సినిమాలో ఎలా చూపిస్తారన్న దానిపై చర్చ జరిగింది. అయితే సోమవారం విడుదలైన ట్రైలర్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అయింది. కొన్ని డైలాగ్‌ల ను బట్టి చూస్తే పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ప్రతిఘటన ఎదురైనట్టు […]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకుని తీస్తున్న ”యాత్ర” చిత్రం ట్రైలర్ విడుదలైంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసిన నేపథ్యంలో…. ఈ చిత్రం కాంగ్రెస్ కు కూడా మైలేజ్ ఇస్తుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కాంగ్రెస్ పాత్రను సినిమాలో ఎలా చూపిస్తారన్న దానిపై చర్చ జరిగింది.
అయితే సోమవారం విడుదలైన ట్రైలర్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అయింది. కొన్ని డైలాగ్‌ల ను బట్టి చూస్తే పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ప్రతిఘటన ఎదురైనట్టు స్పష్టమవుతోంది. వాటిని ఎదుర్కొని వైఎస్ ముందుకెళ్లినట్టుగా సినిమాలో చూపించారని తెలుస్తోంది.
”ఇది హైకమాండ్ నిర్ణయం రెడ్డి…. మీరు పాటించి తీరాలి” అన్న డైలాగ్‌ను హైకమాండ్ ప్రతినిధి వినిపించగా… అందుకు వైఎస్ పాత్రధారి… ”నా విధేయతను, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోవద్దు” అని ఘాటుగానే సమాధానం చెబుతారు. ”మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి రెడ్డి సాబ్” అని హైకమాండ్ ప్రతినిధి హెచ్చరించగా…. ”మాట ఇచ్చే ముందు ఆలోచిస్తా… ఇచ్చాక ఆలోచించేది ఏముంది?. ముందుకు వెళ్లాల్సిందే” అని వైఎస్ పాత్రలో మమ్ముట్టి సమాధానం ఇస్తారు.
ట్రైలర్ ఆఖరిలో మరో కీలకమైన డైలాగ్ కూడా ఉంది. ఒక వ్యక్తి…. ”రాజశేఖరా నీవు మారావు అని నేను నమ్ముతున్నా… ఈసారి నా ఓటు నీకే. నీ పార్టీకి కాదు” అన్న డైలాగ్ ఉంది. దీన్ని బట్టి పాదయాత్ర సమయంలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది వైఎస్‌ను చూసేగానీ… కాంగ్రెస్‌ను చూసి కాదన్న మెసేజ్‌ను చిత్రం ద్వారా ఇస్తున్నట్టు అర్థమవుతోంది. సినిమా ట్రైలర్‌లో వైఎస్ పాత్రధారి చెప్పిన కొన్ని డైలాగ్‌లు కదిలించేలా ఉన్నాయి.