రైల్వే మంత్రిని అడ్డుకున్న టీడీపీ ఎంపీలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన తర్వాత పార్లమెంటు వెలుపలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ నిరసన కొనసాగుతుండగానే బయటకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయుష్ గోయల్ మీడియా ప్రతినిధులను తన వద్దకు పిలిపించుకున్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని అన్నప్పుడు.. ఇదే టీడీపీ […]

Advertisement
Update:2019-01-07 10:44 IST

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన తర్వాత పార్లమెంటు వెలుపలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

టీడీపీ ఎంపీ నిరసన కొనసాగుతుండగానే బయటకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయుష్ గోయల్ మీడియా ప్రతినిధులను తన వద్దకు పిలిపించుకున్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని అన్నప్పుడు.. ఇదే టీడీపీ హోదా వద్దు సరే ప్యాకేజీ ఇవ్వండని అంగీకరించిందని ఆయన గుర్తు చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఆందోళన పేరుతో టీడీపీ ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఏపీ ప్రజలు తగిన బుద్ది చెబుతారని గోయల్ ఘాటుగా హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News