మీడియా ప్రతినిధులకు క్లాస్‌ తీసుకున్న చంద్రబాబు....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులకు క్లాస్ పీకారు. తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని సామాన్యులకు అందుబాటులో లేకుండా చాలా ఖరీదు అవుతోందని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… చంద్రబాబు ఆగ్రహించారు. రాజధాని కాస్ట్‌లీగా ఎక్కడ మారిందంటూ చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. మీకు విజన్‌ లేకుండాపోయిందని మీడియా ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని… మీడియా ప్రతినిధుల వైఖరే మారాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు […]

Advertisement
Update:2018-12-29 05:38 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులకు క్లాస్ పీకారు. తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమరావతి రాజధాని సామాన్యులకు అందుబాటులో లేకుండా చాలా ఖరీదు అవుతోందని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… చంద్రబాబు ఆగ్రహించారు.

రాజధాని కాస్ట్‌లీగా ఎక్కడ మారిందంటూ చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. మీకు విజన్‌ లేకుండాపోయిందని మీడియా ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు.

ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని… మీడియా ప్రతినిధుల వైఖరే మారాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు సంతోషంగా ఉండడంతో మీడియా ప్రతినిధులు సంతోషంగా లేరని రుసరుసలాడారు సీబీఎన్‌.

అమరావతిలో అందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. 500 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం రిజర్వ్ చేసినట్టు చంద్రబాబు చెప్పారు. అమరావతిని గ్రీన్‌ అండ్ బ్లూ సిటీగా నిర్మిస్తామన్నారు. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News