నెల పాటు ప్రత్యేక విమానాన్ని బుక్‌ చేసుకున్న కేసీఆర్‌

తెలంగాణలో ఘన విజయం సాధించిన కేసీఆర్‌… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో హవా చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణలో కనివిని ఎరుగని విజయంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఒకప్పుడు కేసీఆర్‌ ను పెద్దగా పట్టించుకోని ఇతర రాష్ట్రాల నేతలు ఇప్పుడు కేసీఆర్‌కు ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రెంట్‌ కోసం తాను దేశ వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పిన కేసీఆర్…. 23 నుంచి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. […]

Advertisement
Update:2018-12-22 04:53 IST

తెలంగాణలో ఘన విజయం సాధించిన కేసీఆర్‌… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో హవా చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణలో కనివిని ఎరుగని విజయంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది.

ఒకప్పుడు కేసీఆర్‌ ను పెద్దగా పట్టించుకోని ఇతర రాష్ట్రాల నేతలు ఇప్పుడు కేసీఆర్‌కు ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రెంట్‌ కోసం తాను దేశ వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పిన కేసీఆర్…. 23 నుంచి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి వెళ్తారు.

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి స్వామిస్వరూపనందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం కూడా ఆశ్రమంలోనే ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం ఆరు గంటలకు నవీవ్ పట్నాయక్‌ను ఆయన నివాసంలోనే కలుస్తారు.

రాత్రికి ఒడిషా సీఎం అధికారిక నివాసంలోనే కేసీఆర్ బస చేస్తారు. 24 ఉదయం రోడ్డు మార్గంలో వెళ్లి కోణార్క్ దేవాలయాన్ని సందర్శిస్తారు. జగన్నాథ ఆలయానికి కూడా వెళ్తున్నారు. 24 సాయంత్రం బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. బెంగాల్ కాళీమాత ఆలయాన్ని సందర్శిస్తారు.

25 నుంచి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ ఉంటారు. అక్కడే పలువురు జాతీయ నాయకులను కేసీఆర్‌ కలుస్తారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమైనా కేసీఆర్‌ సింగిల్‌గా నిలబడి గెలిచిన తీరు జాతీయ నాయకులను కూడా ఆకట్టుకుంటోంది. దాంతో కేసీఆర్‌కు వారిచ్చే ప్రాధాన్యత కూడా పెరిగింది.

దేశవ్యాప్తంగా పర్యటించేందుకు కేసీఆర్ నెల రోజుల పాటు ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిలోనే పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే ఆసదుద్దీన్ ఓవైసీతో కలిసి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా పర్యటించేందుకు రెండు హెలికాప్టర్లను కూడా కేసీఆర్‌ బుక్ చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News