వైసీపీకి బంగారు పళ్ళెంలో సీట్లు పెట్టి ఇవ్వడమే అంటున్ననేతలు
ఇప్పటి వరకు పొత్తుల వల్ల టీడీపీ బాగుపడిందే గానీ… చంద్రబాబుతో చేయి కలిపి మనుగడ సాగించిన పార్టీలు చరిత్రలో కనిపించవు. ఇప్పటికే బీజేపీతో పలుమార్లు, వామపక్షాలు, లోక్‌సత్తా, జనసేనతో పొత్తు పూర్తి చేసిన చంద్రబాబు అసాధ్యం అనుకున్న కాంగ్రెస్‌ను కౌగిలించుకున్నారు. ఆ కౌగిలింత దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ దాదాపు నేలమట్టం అయింది. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు కదా… మరి ఏపీలోనూ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా? అన్నప్పుడు టీడీపీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్- టీడీపీ కలిసి పనిచేస్తే […]
ఇప్పటి వరకు పొత్తుల వల్ల టీడీపీ బాగుపడిందే గానీ… చంద్రబాబుతో చేయి కలిపి మనుగడ సాగించిన పార్టీలు చరిత్రలో కనిపించవు. ఇప్పటికే బీజేపీతో పలుమార్లు, వామపక్షాలు, లోక్‌సత్తా, జనసేనతో పొత్తు పూర్తి చేసిన చంద్రబాబు అసాధ్యం
అనుకున్న కాంగ్రెస్‌ను కౌగిలించుకున్నారు.
ఆ కౌగిలింత దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ దాదాపు నేలమట్టం అయింది. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు కదా… మరి ఏపీలోనూ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా? అన్నప్పుడు టీడీపీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్- టీడీపీ కలిసి పనిచేస్తే లాభమా నష్టమా అన్న దానిపై రెండు పార్టీల్లోనూ భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు కూడా కాంగ్రెస్‌తో ఏపీలో పొత్తుకు సుముఖంగా లేరు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాంగ్రెస్‌తో స్నేహం కొనసాగడం అత్యవసరమని భావిస్తున్న చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 30 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సీనియర్లు మాత్రం అలా చేయడాన్ని ఇష్టపడడం లేదు. టీడీపీ- కాంగ్రెస్ మధ్య ఓట్ల బదిలీ అయ్యేపని కాదని… ఒకవేళ కాంగ్రెస్‌కు 30 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాలు కేటాయిస్తే అవన్నీ వైసీపీకి బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చినట్టు అవుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం టీడీపీకి ఏపీలో ఏ పార్టీ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేనందున…. కలిసి వచ్చిన కాంగ్రెస్‌తో వెళ్తే ఒకటి రెండు శాతం ఓట్లయినా కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి. సింగిల్‌గా పోటీ చేస్తే ప్రజలు అభినందిస్తారే గానీ… కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి లేదని జేడీ శీలం లాంటి నేతల అభిప్రాయం.
టీడీపీతో నేరుగా పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని వాదిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు మాత్రం టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కాంగ్రెస్‌లో ఎవరి వాదనలు ఎలా ఉన్నా… చంద్రబాబు అనుకున్నదే ఏపీ కాంగ్రెస్‌లో జరుగుతుందని ఆపార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు రాష్ట్ర్ర నాయకత్వంతో కాకుండా నేరుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో డీల్ మాట్లాడుకుంటారని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ- కాంగ్రెస్ పొత్తు విషయంలోనూ అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు.