ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ డేట్ మారింది

జస్ట్ 2 వారాల గ్యాప్ లో రెండు పార్టులు విడుదల చేస్తామంటూ అప్పట్లో గ్రాండ్ గా ప్రకటించారు మేకర్స్. కానీ అలా విడుదల చేయడం వల్ల రెండు సినిమాలకు రెవెన్యూ తగ్గిపోతుంది. వసూళ్లు దారుణంగా పడిపోతాయి. మరీ ముఖ్యంగా రికార్డులు సృష్టించడం వీలుకాదు. అందుకే ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తంచేశారు. నేరుగా బాలయ్యకే ఈ విషయాన్ని చేరవేశారు. దీంతో యూనిట్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 రిలీజ్ ను వాయిదా వేశారు. లెక్కప్రకారం, రిపబ్లిక్ డే […]

Advertisement
Update:2018-12-19 14:32 IST

జస్ట్ 2 వారాల గ్యాప్ లో రెండు పార్టులు విడుదల చేస్తామంటూ అప్పట్లో గ్రాండ్ గా ప్రకటించారు మేకర్స్. కానీ అలా విడుదల చేయడం వల్ల రెండు సినిమాలకు రెవెన్యూ తగ్గిపోతుంది. వసూళ్లు దారుణంగా పడిపోతాయి. మరీ ముఖ్యంగా రికార్డులు సృష్టించడం వీలుకాదు. అందుకే ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తంచేశారు. నేరుగా బాలయ్యకే ఈ విషయాన్ని చేరవేశారు. దీంతో యూనిట్ వెనక్కి తగ్గక తప్పలేదు.

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 రిలీజ్ ను వాయిదా వేశారు. లెక్కప్రకారం, రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ అభిమానుల ఒత్తిడి మేరకు ఫిబ్రవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నప్పటికీ.. ఆడియో, ట్రయిలర్ రిలీజ్ వేడుకల్ని మాత్రం కామన్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి 21న ట్రయిలర్ విడుదల కానుంది. ఈ ట్రయిలర్ లో పార్ట్-1, పార్ట్-2కు చెందిన క్లిప్స్ కలిపే ఉంటాయి. ఇక ఆడియోను కూడా విడివిడిగా కాకుండా.. రెండు పార్టులకు సంబంధించిన పాటలన్నింటినీ కలిపి రిలీజ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News