సినిమా రిలీజ్ అయింది.... రామ్ గోపాల్ వర్మ కనిపించట్లేదు....
సినిమా థియేటర్లలోకి వచ్చే ముందు రోజు వరకు రామ్ గోపాల్ వర్మ చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాను పైకి లేపడం కోసం ఎవర్నయినా టార్గెట్ చేస్తాడు. ఎన్ని మాటలైనా అనేస్తాడు. ఒక్కోసారి ఇతడి వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అవుతాయి. అయితే ఒక్కసారి సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత వర్మ ఇక కనిపించడు. ఎందుకంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది కాబట్టి. ఈసారి కూడా వర్మ అలానే పరారయ్యాడు. తను సమర్పించిన భైరవగీత […]
సినిమా థియేటర్లలోకి వచ్చే ముందు రోజు వరకు రామ్ గోపాల్ వర్మ చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాను పైకి లేపడం కోసం ఎవర్నయినా టార్గెట్ చేస్తాడు. ఎన్ని మాటలైనా అనేస్తాడు. ఒక్కోసారి ఇతడి వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అవుతాయి.
అయితే ఒక్కసారి సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత వర్మ ఇక కనిపించడు. ఎందుకంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది కాబట్టి. ఈసారి కూడా వర్మ అలానే పరారయ్యాడు.
తను సమర్పించిన భైరవగీత సినిమాపై వర్మ ఈమధ్య కాలంలో చేసిన కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. తన సినిమా కోసం ఏకంగా రజనీకాంత్ నటించిన 2.O సినిమాపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వర్మ.
ఇంత హైప్ ఇచ్చిన భైరవగీత సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఆర్జీవీ మరోసారి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు.
భైరవగీత హంగామా రిలీజైన మొదటి రోజుతోనే పూర్తవ్వడంతో ఇప్పుడు తన దృష్టి మొత్తాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టాడు ఈ దర్శకుడు. మళ్లీ ఈ సినిమా విడుదల సమయానికి మీడియా ముందుకొస్తాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఉన్నవిలేనివీ కల్పించి చెబుతాడు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయితే, ఎప్పట్లానే మరోసారి పరార్ అవుతాడు. ఇది ప్రస్తుతం వర్మ పరిస్థితి.