ఎలా ఓడాం.... కాంగ్రెస్ పోస్టుమార్టం....
ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్లు బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్ కు చేరుకొని పోస్టుమార్టం నిర్వహించారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన జానారెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర, డీకే అరుణ, గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు గాంధీభవన్ లో ఓటమిపై సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే అని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. కేసీఆర్ ను టార్గెట్ చేయడం తమకు నష్టం చేకూర్చిందని.. […]
ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్లు బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్ కు చేరుకొని పోస్టుమార్టం నిర్వహించారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన జానారెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర, డీకే అరుణ, గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు గాంధీభవన్ లో ఓటమిపై సమాలోచనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే అని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. కేసీఆర్ ను టార్గెట్ చేయడం తమకు నష్టం చేకూర్చిందని.. కేసీఆర్ ను వ్యక్తిగతంగా తిట్టడం పార్టీకి నష్టం చేసిందన్నారు.
టీడీపీ పొత్తు కాంగ్రెస్ కు అతిపెద్ద గుదిబండగా మారిందని…. కేసీఆర్ చంద్రబాబును బూచిగా చూపి సెంటిమెంట్ రాజేశారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారని తెలిసింది. జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా ఓడిపోవడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలపై బలంగా ప్రభావం చూపాయని అభిప్రాయపడ్డారు.
ఇక కాంగ్రెస్ తరుఫున అసెంబ్లీలో శాసనసభాపక్షనేతను ఎన్నుకునే విషయంలో కూడా నేతలు చర్చించారు. మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్, శ్రీధర్ బాబు లాంటి నేతలను శాసనసభాపక్ష నేతగా ప్రకటించే అవకాశాలున్నట్టు తెలిసింది. ఈరోజు రాత్రిలోగా ఈ విషయం తేల్చనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.