కూటమి కొనసాగింపుపై భట్టి కామెంట్స్

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. అధికారం కోసం తహతహలాడే పార్టీ కాంగ్రెస్‌ కాదన్నారు. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు భట్టి పిలుపునిచ్చారు. 1994లో 294 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ నుంచి 26 మంది మాత్రమే గెలిచారని గుర్తు చేశారు. అలాంటి సమయంలోనూ కాంగ్రెస్ ప్రతిపక్షంలో పోరాటం చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిందన్నారు. […]

Advertisement
Update:2018-12-13 11:37 IST

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. అధికారం కోసం తహతహలాడే పార్టీ కాంగ్రెస్‌ కాదన్నారు. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు భట్టి పిలుపునిచ్చారు.

1994లో 294 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ నుంచి 26 మంది మాత్రమే గెలిచారని గుర్తు చేశారు. అలాంటి సమయంలోనూ కాంగ్రెస్ ప్రతిపక్షంలో పోరాటం చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు 119 సభ్యులున్న తెలంగాణ సభలోనే 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తరపున గెలిచారన్నారు.

గెలుపు శాశ్వతం కాదన్న విషయం అధికార పక్షం గుర్తించుకోవాలన్నారు. తమిళనాడులో 1980లో కాంగ్రెస్‌, డీఎంకే కలిసి లోక్‌సభ ఎన్నికల్లో 40కి 40 స్థానాలను క్లీన్ స్వీప్ చేశాయన్నారు. తిరిగి మూడు నెలలకే అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అన్నాడీఎంకే పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

నెలల వ్యవధిలోనే ప్రభుత్వాల పనితీరు సరిగా లేకుంటే ప్రజలు బండకేసి కొడుతారని చెప్పేందుకు చరిత్రలో ఎన్నో నిదర్శనాలున్నాయన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

మహాకూటమి అన్నది అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీసుకున్న నిర్ణయమన్నారు. మునుముందు కొనసాగుతుందా లేదా అన్నది చర్చించి చెబుతామన్నారు. మహాకూటమి ఓటమికి చంద్రబాబు కారణమన్న విశ్లేషణలపై స్పందించిన భట్టి విక్రమార్క…. ఈ అంశంపై లోతుగా విశ్లేషించిన తర్వాతే స్పందిస్తామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం మానుకోవాలని కేసీఆర్‌కు సూచించారు.

Tags:    
Advertisement

Similar News