తెలంగాణ ఎన్నికలపై సీపీఎస్‌ సంచలన సర్వే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీపీఎస్‌ సంచలన ప్రీపోల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేను ప్రముఖ తెలుగు టీవీ చానల్‌ ప్రసారం చేసింది. ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 94 నుంచి 104 స్థానాలు వస్తాయని తేలింది. కాంగ్రెస్‌-టీడీపీ నేతృత్వంలోని మహాకూటమికి కేవలం 16 నుంచి 21 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తేల్చింది. బీజేపీ ఒకటి నుంచి రెండు, ఎంఐఎం ఏడు స్థానాల్లో విజయం సాధించనుంది. ఇతరులు ఒకచోట గెలిచే చాన్స్ ఉందని సీపీఎస్ వెల్లడించింది. ఓటింగ్ శాతం చూస్తే […]

Advertisement
Update:2018-12-03 17:13 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీపీఎస్‌ సంచలన ప్రీపోల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేను ప్రముఖ తెలుగు టీవీ చానల్‌ ప్రసారం చేసింది.

ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 94 నుంచి 104 స్థానాలు వస్తాయని తేలింది. కాంగ్రెస్‌-టీడీపీ నేతృత్వంలోని మహాకూటమికి కేవలం 16 నుంచి 21 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తేల్చింది. బీజేపీ ఒకటి నుంచి రెండు, ఎంఐఎం ఏడు స్థానాల్లో విజయం సాధించనుంది. ఇతరులు ఒకచోట గెలిచే చాన్స్ ఉందని సీపీఎస్ వెల్లడించింది.

ఓటింగ్ శాతం చూస్తే టీఆర్‌ఎస్‌కు 49. 7 శాతం, మహాకూటమికి 32. 3 శాతం ఓట్లు, బీజేపీకి 9.1 శాతం ఓట్లు, ఎంఐఎంకు 2.4 శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్ సర్వే వెల్లడించింది. ఇతరుల ఓటింగ్ శాతం 6.5 గా ఉంది. టీఆర్‌ఎస్ ఓటింగ్‌ శాతం 2014తో పోలిస్తే 34 శాతం నుంచి 49.7 శాతానికి పెరుగుతుందని సర్వే వెల్లడించింది.

ఈసర్వేపై సదరు చానల్‌తో మాట్లాడిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా బోగస్ సర్వే అని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News