రాజ్యాంగాన్ని రక్షించేందుకు చంద్రబాబు మహానుభావుడిలా వచ్చారు " గద్దర్

గాయకుడు గద్దర్‌ చంద్రబాబును కీర్తించారు. గతంలో తన శరీరంలోకి తూటాలు దింపించింది చంద్రబాబేనని చెప్పిన గద్దర్ … ఖమ్మం బహిరంగ సభ వేదికగా చంద్రబాబును ప్రసంశించారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించేందుకు ఇద్దరు మహానుభావులు ముందుకొచ్చారని రాహుల్, చంద్రబాబును ఉద్దేశించి గద్దర్ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి నాశనం చేసేందుకు ఢిల్లీలో కుట్ర జరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో సేవ్ డెమొక్రసి అంటూ బయలుదేరిన ఇద్దరు మహానుభావులు రాహుల్, చంద్రబాబు అంటూ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై ” పొడుస్తున్న పొద్దు […]

Advertisement
Update:2018-11-28 23:33 IST

గాయకుడు గద్దర్‌ చంద్రబాబును కీర్తించారు. గతంలో తన శరీరంలోకి తూటాలు దింపించింది చంద్రబాబేనని చెప్పిన గద్దర్ … ఖమ్మం బహిరంగ సభ వేదికగా చంద్రబాబును ప్రసంశించారు.

రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించేందుకు ఇద్దరు మహానుభావులు ముందుకొచ్చారని రాహుల్, చంద్రబాబును ఉద్దేశించి గద్దర్ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి నాశనం చేసేందుకు ఢిల్లీలో కుట్ర జరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో సేవ్ డెమొక్రసి అంటూ బయలుదేరిన ఇద్దరు మహానుభావులు రాహుల్, చంద్రబాబు అంటూ ధన్యవాదాలు తెలిపారు.

వేదికపై ” పొడుస్తున్న పొద్దు మీద… నడస్తున్న కాలమా… పోరు తెలంగాణమా ”
పాటను ఆలపించిన గద్దర్‌… పాట మధ్యలో ”విడిపోయిన బంధమా.. ఎడబాసిన గీతమా” అన్న లైన్ వచ్చినప్పుడు చంద్రబాబువైపు చేయి చూపించారు.

చంద్రబాబు, రాహుల్ కలిసి ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి గొప్ప ఉద్యమాన్ని తీసుకురావాలని గద్దర్ విజ్ఞప్తి చేశారు. మోడీ, కేసీఆర్‌ను వీళ్ళు ఎదిరిస్తున్నారని గద్దర్ చెప్పారు. వేదికపై చంద్రబాబును గద్దర్ ఆలింగనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News