జనసేనలోకి పరిటాల అనుచరుడు?

సాధారణంగా ఏదైనా పార్టీలోకి ఆ పార్టీ అధినేత సమక్షంలోనో…. ఆ పార్టీ ముఖ్య నేతల సమక్షంలో చేరడం అనేది ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ అలాగే జరుగుతూ ఉంటుంది. చేరే నేతల స్థాయిని బట్టి…. అధినేతే వచ్చి వారిని చేర్చుకోవడం లేదా స్థానిక నేతలు వారికి స్వాగతం పలకడం జరుగుతూ ఉంటుంది. అయితే జనసేనలో మాత్రం అలాంటి ముచ్చట్లు లేవు. జనసేనలో ఎవరో కొంతమంది పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేరుతూ ఉంటారు. పవన్ ఏమో ఎంతసేపూ గోదావరి జిల్లాల […]

Advertisement
Update:2018-11-26 05:09 IST

సాధారణంగా ఏదైనా పార్టీలోకి ఆ పార్టీ అధినేత సమక్షంలోనో…. ఆ పార్టీ ముఖ్య నేతల సమక్షంలో చేరడం అనేది ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ అలాగే జరుగుతూ ఉంటుంది.

చేరే నేతల స్థాయిని బట్టి…. అధినేతే వచ్చి వారిని చేర్చుకోవడం లేదా స్థానిక నేతలు వారికి స్వాగతం పలకడం జరుగుతూ ఉంటుంది. అయితే జనసేనలో మాత్రం అలాంటి ముచ్చట్లు లేవు.

జనసేనలో ఎవరో కొంతమంది పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేరుతూ ఉంటారు. పవన్ ఏమో ఎంతసేపూ గోదావరి జిల్లాల చుట్టూతానే తిరుగుతూ ఉంటాడు. రాయలసీమ వంటి ప్రాంతానికి పవన్ వెళ్లిందే లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో జనసేనలోకి ఎవరైనా చేరుదామని అనుకున్నా వారికి పవన్ కల్యాణ్ కనపడడు. అందుకే ఎవరైనా కోరి జనసేనలోకి చేరాలన్నా…. వాళ్లంతకు వాళ్లే వెళ్ళి చేరాలి.

ఇప్పుడు అదే జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో చిలకం మధుసూదన్ రెడ్డి జనసేనలో చేరాడు. ధర్మవరంలో భారీ ర్యాలీ తీసి ఈయన జనసేనలో చేరాడు. అలా తనకు తాను జనసేనలోకి చేరినట్టుగా ప్రకటించుకున్నాడు.

ఇక ఈయన ట్రాక్ రికార్డును చూస్తే…. ఈయనకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. పలు హత్యల్లో, పరిటాల రవి ఆధ్వర్యంలో జరిగిన పలు దందాల్లో ఈయనకు వాటా ఉందంటారు. అలాంటి దందాల్లో బాగా సంపాదించిన మధు ఇప్పుడు జనసేన తరఫున నాయకుడు అయిపోతున్నాడు.

ఇక ఈయనకు ఎమ్మెల్యే స్థాయి లేదనేది బాగా వినిపించే మాట. మహా అంటే ఎంపీపీ రేంజ్ ఇతడిది. అయితే అది జనసేన కాబట్టి…. ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ అనిపించుకుంటున్నాడని స్థానికులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News