టీఆర్‌ఎస్‌కు వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా

టీఆర్‌ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి రాజీనామా చేయగా… ఆయన దారిలోనే తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు రాజీనామా చేశారు. మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ నుంచి వికారాబాద్‌కు సంజీవరావు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి టికెట్‌ దక్కలేదు. మరొకరికి టీఆర్‌ఎస్‌ టికెట్ కేటాయించింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. తనకు టికెట్‌ రాకుండా అడ్డుకున్నది మంత్రి మహేందర్‌రెడ్డేనని ఆరోపించారు. సంజీవరావు తొలి నుంచి ఎంపీ విశ్వేశ్వరరెడ్డికి దగ్గరి వ్యక్తిగా ఉన్నారు. దాంతో ఆయన్ను టీఆర్ఎస్ పక్కన పెట్టినట్టు చెబుతున్నారు. […]

Advertisement
Update:2018-11-21 09:49 IST

టీఆర్‌ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి రాజీనామా చేయగా… ఆయన దారిలోనే తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు రాజీనామా చేశారు. మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ నుంచి వికారాబాద్‌కు సంజీవరావు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి టికెట్‌ దక్కలేదు. మరొకరికి టీఆర్‌ఎస్‌ టికెట్ కేటాయించింది. దీంతో ఆయన రాజీనామా చేశారు.

తనకు టికెట్‌ రాకుండా అడ్డుకున్నది మంత్రి మహేందర్‌రెడ్డేనని ఆరోపించారు. సంజీవరావు తొలి నుంచి ఎంపీ విశ్వేశ్వరరెడ్డికి దగ్గరి వ్యక్తిగా ఉన్నారు. దాంతో ఆయన్ను టీఆర్ఎస్ పక్కన పెట్టినట్టు చెబుతున్నారు.

విశ్వేశ్వరరెడ్డితో పాటు సంజీవరావు కాంగ్రెస్‌లో చేరుతారా లేదా అన్నది తెలియడం లేదు. వికారాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోదిగిన చంద్రశేఖర్‌కు తాను మద్దతు ప్రకటిస్తున్నట్టు సంజీవరావు చెప్పారు. మహేందర్‌ రెడ్డి తనకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. నమ్మినవారే నట్టేట ముంచారన్నారు.

Tags:    
Advertisement

Similar News