కొత్త మోడల్ ఐ ఫోన్లకు తగ్గుతున్న క్రేజ్..!

ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్ బ్రాండ్ అంటే అదో క్రేజ్. ఐఫోన్ కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుందంటే నెలల ముందే బుకింగ్ చేసుకొని విడుదల రోజు స్టోర్స్ ముందు క్యూలు కట్టే అభిమానులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా యాపిల్ విడుదల చేసే మోడల్స్‌పై ఆదరణ తగ్గుతోంది. ఇప్పటికే ఆశించిన అమ్మకాలు లేక యాపిల్ ఐఫోన్ XR మోడల్ ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా ఐఫోన్ XS, XS మాక్స్ మోడళ్ల ఉత్పత్తిని కూడా […]

Advertisement
Update:2018-11-21 01:45 IST

ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్ బ్రాండ్ అంటే అదో క్రేజ్. ఐఫోన్ కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుందంటే నెలల ముందే బుకింగ్ చేసుకొని విడుదల రోజు స్టోర్స్ ముందు క్యూలు కట్టే అభిమానులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా యాపిల్ విడుదల చేసే మోడల్స్‌పై ఆదరణ తగ్గుతోంది.

ఇప్పటికే ఆశించిన అమ్మకాలు లేక యాపిల్ ఐఫోన్ XR మోడల్ ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా ఐఫోన్ XS, XS మాక్స్ మోడళ్ల ఉత్పత్తిని కూడా నిలిపి వేసినట్లు సమాచారం. ఈ ఫోన్లకు అనుకున్న దాని కంటే చాలా తక్కువగా డిమాండ్ ఉందట. అందుకే నిలిపివేసిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

యాపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ధర ఎక్కువైనా ఐఫోన్ కొనుగోలు చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇటీవల చైనా బ్రాండ్స్‌ అయిన ఒప్పో, వీవో, వన్ +, రియల్ మీ వంటివి ఐఫోన్లో అందించే ఫీచర్లనే అతి తక్కువ ధరకే వినియోగదారులకు ఇస్తున్నాయి.

యాపిల్ సంస్థ ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను వీవో సంస్థ 20వేల రూపాయల లోపు లభించే ఫోన్లలో అందిస్తోంది. ఒప్పో బ్రాండ్ ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫీచర్ అయిన VOOC టెక్నాలజీ ఫోన్‌ను 25 వేలకే అందిస్తోంది. దీంతో ఐఫోన్ వినియోగదారులు క్రమంగా ఆండ్రాయిడ్ వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో మరిన్ని కొత్త ఫీచర్లను అందించే విధంగా తమ కొత్త మోడల్స్‌ను రూపొందించే పనిలో యాపిల్ ఇంజినీర్లు కసరత్తులు చేస్తున్నారు. అప్పటి వరకు అమ్మకాలు తక్కువగా ఉన్న బ్రాండ్ల ఉత్పత్తిని నిలిపివేశారు.

Tags:    
Advertisement

Similar News