కాంగ్రెస్ వస్తే కరెంట్ కూడా ఉండదు....
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కరెంట్ కూడా ఉండదన్నారు కేసీఆర్. ప్రపంచ మేధావి అని చెప్పుకునే చంద్రబాబు తన పాలనలో ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్…. తాము ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందన్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు ఎకరాకు ఎనిమిదివేలు ఇచ్చామని…. ఇకపై దాన్ని పది వేలకు పెంచుతామని చెప్పారు. తాము కట్టే డబుల్ బెడ్ రూం ఇల్లు… కాంగ్రెస్ హయాంలో కట్టిన […]
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కరెంట్ కూడా ఉండదన్నారు కేసీఆర్. ప్రపంచ మేధావి అని చెప్పుకునే చంద్రబాబు తన పాలనలో ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.
పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్…. తాము ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందన్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు ఎకరాకు ఎనిమిదివేలు ఇచ్చామని…. ఇకపై దాన్ని పది వేలకు పెంచుతామని చెప్పారు.
తాము కట్టే డబుల్ బెడ్ రూం ఇల్లు… కాంగ్రెస్ హయాంలో కట్టిన ఏడు ఇళ్లకు సమానమన్నారు. సొంత స్థలం ఉన్న వారికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తామన్నారు. సంపదను పెంచుతూ పేదలకు, రైతులకు పంచుతున్నామని చెప్పారు.
దేవాదుల ద్వారా ఒక్క వరంగల్ జిల్లాకే వంద టీఎంసీల నీళ్లు తెస్తామన్నారు. అవినీతి లేకుండా, కుంభకోణాలు చేయకుండా పాలన చేశామన్నారు. వాళ్ళ పదేళ్ల పాలనలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి 9.5 కోట్లు మాత్రమే వస్తే… ఈ నాలుగేళ్లలోనే రెండు వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. నిజాయితీగా పాలన చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.