గ‌జ్వేల్ సీటుకు అంత పెద్ద‌ సెంటిమెంట్ ఉందా ?

గ‌జ్వేల్‌… తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌ వ‌ర్గం. ఇప్పుడు ఈ సీటు రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ నేత ప్ర‌తాప్‌రెడ్డి మ‌ళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ త‌ర‌పున ఈసారి కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నర్సిరెడ్డి కూడా తిరిగి ఆ పార్టీలో చేరారు. దీంతో ఇక్క‌డ ప్ర‌తిప‌క్షం బ‌ల‌ప‌డిన‌ట్లుగా పైకి క‌న్పిస్తోంది. ఇక్క‌డ కేసీఆర్ మ‌ళ్లీ […]

Advertisement
Update:2018-11-10 02:10 IST

గ‌జ్వేల్‌… తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌ వ‌ర్గం. ఇప్పుడు ఈ సీటు రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ నేత ప్ర‌తాప్‌రెడ్డి మ‌ళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ త‌ర‌పున ఈసారి కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నర్సిరెడ్డి కూడా తిరిగి ఆ పార్టీలో చేరారు. దీంతో ఇక్క‌డ ప్ర‌తిప‌క్షం బ‌ల‌ప‌డిన‌ట్లుగా పైకి క‌న్పిస్తోంది. ఇక్క‌డ కేసీఆర్ మ‌ళ్లీ గెలుస్తారా? అనే అనుమానాలు కొంద‌రిలో ఉన్నాయి.

అయితే గ‌జ్వేల్ చ‌రిత్ర పరిశీలిస్తే మాత్రం…సీఎం సీటుకు…గజ్వేల్‌లో గెలుపుకు మాత్రం పెద్ద లింక్ ఉంది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ 2014లో ఇక్క‌డి నుంచి పోటీ చేశార‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ సెంటిమెంట్‌ను ఈ సారి కూడా ఆయ‌న ఫాలో అయ్యే అవ‌కాశం మాత్రం క‌నిపిస్తోంది. గ‌జ్వేల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి వ‌స్తుంది. ఇది ఈ నియోజ‌క‌వ‌ర్గం పుట్టినప్ప‌టి నుంచి ఉన్న సెంటిమెంట్‌. ఇప్ప‌టివ‌ర‌కూ అయితే ఈ సెంటిమెంట్ బ్రేక్ అయింది లేదు.

1978 ఎన్నిక‌లు చూస్తే గ‌జ్వేల్ ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి గ‌జ్వేల్ సైద‌య్య గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆత‌ర్వాత 1983 అల్లం సైదులు విజ‌యం సాధించారు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. ఆత‌ర్వాత 1985లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి సంజీవరావు గెలిస్తే…. ఆ పార్టీయే అధికారంలోకి వ‌చ్చింది.

1989లో గీతారెడ్డిని విజ‌యం వ‌రిస్తే… కాంగ్రెస్ అధికారం కైవ‌సం చేసుకుంది. 1994లో టీడీపీ అభ్య‌ర్థి విజ‌య‌రామారావు గెలిస్తే… ఆ పార్టీ గ‌ద్దెనెక్కింది. 1999లో టీడీపీ క్యాండేట్ సంజీవ‌రావు విజ‌యం సాధించారు. తెలుగుదేశం రెండో సారి అధికారంలోకి రాగ‌లిగింది.

2004లో తిరిగి గీతారెడ్డి గెలిస్తే…కాంగ్రెస్ చారిత్రాత్మ‌క విజ‌యం సాధించింది. 2009లో గ‌జ్వేల్ జ‌న‌ర‌ల్ సీటుగా మారింది. ఇక్క‌డి నుంచి తొలిసారి తూముకుంట న‌ర్సిరెడ్డి గెలుపొందారు. వ‌రుస‌గా రెండో సారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. అయితే 2014లో ఇక్క‌డి నుంచి పోటీ చేసి కేసీఆర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగ‌లిగింది. ఇప్పుడు కేసీఆర్ మ‌ళ్లీ పోటీ చేస్తున్నారు.

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌జ్వేల్‌, తుప్రాన్‌, కొండ‌పాక‌, వ‌ర్గ‌ల్‌, ములుగు, జ‌గ‌దేవ్‌పూర్ మండ‌లాలు ఉన్నాయి. ఇందులో రెండు మండ‌లాల్లో అధికార‌పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సారి ఏం జ‌రుగుతుందో చూడాలి. గ‌త ఎన్నిక‌ల ఫ‌లిత‌మే రిపీట్ అవుతుందా? లేక తెలంగాణ చ‌రిత్ర‌నే మార్చే తీర్పును గ‌జ్వేల్ ప్ర‌జ‌లు ఇస్తారా? అనే విష‌యం చూడాలి.

Tags:    
Advertisement

Similar News