ప్ర‌పంచంలోనే ఈ వింతైన బౌల‌ర్ గురించి మీకు తెలుసా...?

అంత‌ర్జాతీయ క్రికెట్ లో చిత్ర విచిత్రాలు జ‌రుగుతున్నాయి. ఆయా దేశాల క్రికెట్ బోర్డ్ లు టెక్నాల‌జీకి అనుగుణంగా కొత్త ప‌ద్ద‌తుల్ని అవ‌లంభిస్తున్నాయి. రివ్యూల్లో, బౌలింగ్ యాక్ష‌న్ లో, ట్యాంప‌రింగ్ లో ఇలా లోపాల్ని ఎత్తిచూపిస్తున్నాయి. టెక్నాల‌జీ ప‌రంగా బ్యాట్స్ మెన్ కు ఎలాంటి ఆంక్ష‌లు లేకున్నా..బౌలింగ్ లో మాత్రం అనేక నిబంధ‌న‌లు ఉన్నాయి. ఆ నిబంధ‌న‌లకు విరుద్దంగా బౌలింగ్ చేస్తే స‌ద‌రు బౌల‌ర్ పై నిషేధాజ్ఞలుంటాయి. అయితే తాజాగా బీసీసీఐ ఓ బౌల‌ర్ గురించి వీడియోను విడుద‌ల […]

Advertisement
Update:2018-11-09 07:20 IST

అంత‌ర్జాతీయ క్రికెట్ లో చిత్ర విచిత్రాలు జ‌రుగుతున్నాయి. ఆయా దేశాల క్రికెట్ బోర్డ్ లు టెక్నాల‌జీకి అనుగుణంగా కొత్త ప‌ద్ద‌తుల్ని అవ‌లంభిస్తున్నాయి. రివ్యూల్లో, బౌలింగ్ యాక్ష‌న్ లో, ట్యాంప‌రింగ్ లో ఇలా లోపాల్ని ఎత్తిచూపిస్తున్నాయి. టెక్నాల‌జీ ప‌రంగా బ్యాట్స్ మెన్ కు ఎలాంటి ఆంక్ష‌లు లేకున్నా..బౌలింగ్ లో మాత్రం అనేక నిబంధ‌న‌లు ఉన్నాయి. ఆ నిబంధ‌న‌లకు విరుద్దంగా బౌలింగ్ చేస్తే స‌ద‌రు బౌల‌ర్ పై నిషేధాజ్ఞలుంటాయి.

అయితే తాజాగా బీసీసీఐ ఓ బౌల‌ర్ గురించి వీడియోను విడుద‌ల చేసింది. ప్రస్తుతానికి ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌గా…. బౌలింగ్ వేసే విధానం క్రికెట్ చ‌రిత్రలో చ‌ర్చనీయాంశంగా మారింది.

Link: http://www.bcci.tv/videos/id/7047/switch-bowling-whats-that

అండ‌ర్ – 23 సీకే నాయుడు టోర్నీలో యూపీకి చెందిన స్పిన్న‌ర్ శివ సింగ్ బౌలింగ్ వేశాడు. శివ‌సింగ్ బౌలింగ్ తో క్రికెట‌ర్లు, అంపైర్ తో స‌హా కంగుతిన్నారు. అయితే ఆ బౌలింగ్ పై అంపైర్ నోబాల్ గా ప్ర‌క‌టించారు. ఎందుకంటే శివ‌సింగ్ 360 డిగ్రీల కోణంలో బంతితో పాటు తాను కూడా తిరిగి బౌలింగ్ చేయ‌డమే. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్, సునీల్ న‌రైన్, మ‌లింగ్, బూమ్రా , ఆడ‌మ్స్ బౌలింగ్ స్టైల్ ను త‌ల‌ద‌న్నేలా బౌలింగ్ చేయ‌డంతో శివ‌సింగ్ బౌలింగ్‌ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉందంటూ అంపైర్ పేర్కొన్నాడు.

అయితే శివ‌సింగ్ బౌలింగ్ పై జోకులు పేలుతున్నాయి. బ్యాటింగ్ లో స‌చిన్ – ధోని కొత్త‌టెక్నిక్ లు ఎలా తెచ్చారో..బౌలింగ్ లో కూడా శివ‌సింగ్ కొత్త టెక్నిక్ ను క‌నిపెట్టాడ‌ని జోకులేస్తున్నారు. ప్ర‌పంచంలో అత్యుత్త‌మైన వింత‌బౌల‌ర్ అని కితాబిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News