కాంగ్రెస్‌కి కోదండరాంకి పంచాయతీ ఎక్కడ?
హైదరాబాద్‌లో తేలలేదు. ఢిల్లీ వెళ్లారు. కానీ పొత్తుల బండి చూస్తే మళ్లీ హైదరాబాద్‌కే వచ్చింది. తెలంగాణ జనసమితి నేత కోదండరాం హస్తిన వెళ్లి….కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఇది మహాకూటమి కాదు ప్రజా కూటమి అని పిలుస్తున్నారు. ఈ కూటమి సీట్ల లెక్క సంగతి తేలుతుందని అందరూ ఆశించారు. కానీ చివరికి…. చూస్తే కూటమి లెక్క తేలలేదు. హైదరాబాద్‌లోనే కాంగ్రెస్ నేతలతో మాట్లాడి సీట్ల లెక్క తేల్చుకోవాలని కోదండరాంకి రాహుల్ సూచించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో […]
హైదరాబాద్‌లో తేలలేదు. ఢిల్లీ వెళ్లారు. కానీ పొత్తుల బండి చూస్తే మళ్లీ హైదరాబాద్‌కే వచ్చింది. తెలంగాణ జనసమితి నేత కోదండరాం హస్తిన వెళ్లి….కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఇది మహాకూటమి కాదు ప్రజా కూటమి అని పిలుస్తున్నారు. ఈ కూటమి సీట్ల లెక్క సంగతి తేలుతుందని అందరూ ఆశించారు. కానీ చివరికి…. చూస్తే కూటమి లెక్క తేలలేదు. హైదరాబాద్‌లోనే కాంగ్రెస్ నేతలతో మాట్లాడి సీట్ల లెక్క తేల్చుకోవాలని కోదండరాంకి రాహుల్ సూచించారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో కోదండరాం 40 నిమిషాల సేపు సమావేశమయ్యారు. సీట్ల విషయం చర్చకు రాలేదని కోదండరాం చెప్పారు. కానీ సీట్ల విషయం ఇక్కడ తేలేది కాదని సీనియర్ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే ఓవర్‌టు హైదరాబాద్ అని చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోనే ఉత్తమ్, కుంతియా ఓ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 95 సీట్లలో పోటీ చేస్తుంది. టీడీపీకి 14 సీట్లు ఇచ్చాం… మిగిలిన పదిసీట్లు సీపీఐ, టీజేఎస్‌కు అని సెలవిచ్చారు. కాంగ్రెస్ లిస్ట్‌లో 57 మందికి హైకమాండ్ క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మిగిలిన పది సీట్లలో టీజేఎస్, సీపీఐ పంచుకోవాలి. ఇక్కడే కాంగ్రెస్‌కి కోదండరాంకి పంచాయతీ వచ్చినట్లు తెలుస్తోంది.
25 నియోజకవర్గాల్లో తాము గ్రౌండ్ వర్క్ చేశామని…. కానీ తాము 17సీట్లలో పోటీచేయాలని భావించినట్లు కోదండరాం చెప్పారు. కానీ తాము ఇప్పుడు 15 సీట్లు మాత్రమే కోరుతున్నామని ఆయన చెప్పారు. అయితే ఈ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడే పేచీ వచ్చినట్లు తెలుస్తోంది.
టీజేఎస్‌కు 6 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ఇటు సీపీఐకి 6 సీట్లు ఇవ్వబోతుంది. అయితే ఈ సీట్ల విషయంలో కూడా సీపీఐ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీట్ల విషయాన్ని కాంగ్రెస్ తేల్చేసింది. మరీ టీజేఎస్, సీపీఐ సీట్ల సంఖ్యను ఎప్పుడూ తేలుస్తారో చూడాలి. మరోవైపు కోదండరాం తాను పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. వ్యక్తుల పోటీ ముఖ్యం కాదని… పార్టీలు ముఖ్యమని సెలవిచ్చారు.