పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియామీర్జా

సానియా మీర్జా ఇంట ఆనందం వెల్లివిరిసింది. షోయబ్ మాలిక్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వీరిద్దరికి మంగళవారం ఉదయం సంతానం కలిగింది. సానియా మీర్జా మంగళవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షోయబ్ మాలిక్ ట్వీట్ చేస్తూ ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ శుభవార్త మీ అందరితో పంచుకుంటున్నా.. మాకు పండండి మగబిడ్డ జన్మించాడు. నా భార్య […]

Advertisement
Update:2018-10-30 06:25 IST

సానియా మీర్జా ఇంట ఆనందం వెల్లివిరిసింది. షోయబ్ మాలిక్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వీరిద్దరికి మంగళవారం ఉదయం సంతానం కలిగింది. సానియా మీర్జా మంగళవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

షోయబ్ మాలిక్ ట్వీట్ చేస్తూ ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ శుభవార్త మీ అందరితో పంచుకుంటున్నా.. మాకు పండండి మగబిడ్డ జన్మించాడు. నా భార్య సానియా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. దీనికి బేబీ మీర్జా మాలిక్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించి వైరల్ చేశారు.

ఈ విషయం తెలియగానే భారత్ , పాకిస్తాన్ కు చెందిన క్రీడా , సినీ ప్రముఖులు సానియా-షోయబ్ మాలిక్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. బాలీవుడ్ కొరియో గ్రాఫర్ ఫరాఖాన్ ట్విట్టర్ లో ‘కంగ్రాట్స్ సానియా-షోయాబ్.. శుభవార్త చెప్పారు’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా తొలి బిడ్డ పుట్టినందుకు షోయాబ్ మాలిక్ ఉబ్బితబ్బవుతున్నాడని… ఆయన ఆనందంతో ఇంట పండుగ చేసుకుంటున్నాడని ఆయన మేనేజర్ మీడియాకు తెలిపారు. 2010లో సానియా-షోయాబ్ వివాహమైంది. క్రీడల్లో కెరీర్ దృష్ట్యా వీరిద్దరూ పిల్లలు మొదట్లో వద్దనుకున్నారు. ఇక సానియా కెరీర్ కు కాస్త విరామం ఇచ్చి ప్లాన్ చేసుకున్నారు. బిడ్డ కోసం టెన్సిస్ కు దూరంగా ఉన్న సానియా తిరిగి 2020లో టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నట్టు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News