జగన్ హత్యకు సింపుల్‌గా ప్లాన్ చేయడం వెనుక ముందు చూపు....
జగన్‌పై దాడి జరిగిన వెంటనే దాన్ని చాలా మంది పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ దాడి నుంచి జగన్ ప్రాణాలతో బయటపడిన వెంటనే డీజీపీ మెరుపు స్పందన, ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా ఎదురుదాడి మొదలు పెట్టడంతో ఏదో ఉందన్న అనుమానాలు బయలుదేరాయి. ఆ తర్వాత 11 పేజీల లేఖ నాటకాన్ని రక్తి కట్టించబోయి బాబు యంత్రాంగం బొక్కబోర్లా పడింది. నిందితుడి జేబులో లేఖ దొరికిందని చెబుతున్నా … మీడియాకు విడుదల చేసినప్పుడు 11 పేజీలు […]
జగన్‌పై దాడి జరిగిన వెంటనే దాన్ని చాలా మంది పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ దాడి నుంచి జగన్ ప్రాణాలతో బయటపడిన వెంటనే డీజీపీ మెరుపు స్పందన, ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా ఎదురుదాడి మొదలు పెట్టడంతో ఏదో ఉందన్న అనుమానాలు బయలుదేరాయి.
ఆ తర్వాత 11 పేజీల లేఖ నాటకాన్ని రక్తి కట్టించబోయి బాబు యంత్రాంగం బొక్కబోర్లా పడింది. నిందితుడి జేబులో లేఖ దొరికిందని చెబుతున్నా … మీడియాకు విడుదల చేసినప్పుడు 11 పేజీలు ఏమాత్రం నలిగిపోకుండా, మడతలు లేకుండా ఉండడంతో అది సృష్టించబడ్డ లేఖ అని స్పష్టమైపోయింది.
ఆతర్వాత ఫ్లెక్సీ డ్రామా కూడా బెడిసికొట్టింది. విడుదల చేసిన ఫ్లెక్సీ ఫొటోకు, అసలైనదని చెప్పిన ఫ్లెక్సీకి మధ్య తేడాలు స్పష్టంగా కనిపించాయి. ఒకదాంట్లో పువ్వులుండగా… మరొకదానిలో పువ్వులు లేవు. దీంతో జనం చెవిలో పెట్టాలనుకున్న పూవు వ్యవహారం బెడిసికొట్టింది. అయితే ప్రతిపక్ష నేత జగన్‌ను హత్య చేసేందుకు మరీ ఇంత చిన్న కత్తితో ఎందుకు ప్లాన్ చేశారన్నది కొందరి అనుమానం.
కానీ ఆ అనుమానం రావాలనే ముఠా ఇలా ప్లాన్ చేసింది. జగన్‌పై తుపాకులతోనో, బాంబులతోనో దాడి చేయిస్తే అది హత్య అని ఆ క్షణమే నిర్దారణ అవుతుంది. అప్పుడు అందరి వేళ్లు చంద్రబాబువైపే వెళ్తాయి. పైగా గొడవలు చెలరేగే అవకాశాలు ఎక్కువ. గతంలో వంగవీటి రంగాను హత్య చేసిన సమయంలో జరిగిన అల్లర్లు, వాటితో టీడీపీ నేతలకు, ఒక సామాజికవర్గానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.
కాబట్టి జగన్‌ను హత్య చేసేందుకు సూక్ష్మమైన పద్దతిని అనుసరించారని భావిస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్టుగానే జగన్ మెడ నరాలను కత్తితో తెంచేసి, ఆయన చనిపోయి ఉంటే…. వెంటనే అది ఒక ఉన్మాది, ఒక అభిమాని చేసిన దాడి…. దురదృష్టం కొద్ది జగన్ చనిపోయాడు అని వెంటనే మెరుపు వేగంతో ప్రచారం మొదలయ్యేది. సామాన్య ప్రజలు కూడా జగన్‌ను ఒక ఉన్మాది చంపేశారట అని గందరగోళంలో పడిపోయేవారు.
వైసీపీ వారికి కూడా జగన్‌పై దాడి పెద్దలు చేయించారా లేక నిజంగానే ఒక ఉన్మాది చేశారా అన్న అనుమానంతో ఉండిపోయేవారు. జగన్‌పై హత్యకు ప్లాన్ చేసిన వారి ఉద్దేశం కూడా అదే. జగన్ హత్య జరగాలి… కానీ దాని వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉందన్న అభిప్రాయం ఎవరికీ కలగకూడదు. వైఎస్ హెలికాప్టర్ ప్రయాణంలో అనుమానాస్పదంగా చనిపోయారు.
ఇప్పటికీ ఆయనది ప్రమాదమా లేక కుట్రప్రకారం జరిగినా హత్య అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వైఎస్‌ది హత్య అని అప్పుడే నిర్ధారణ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ వైఎస్ మరణంపై క్లారిటీ లేదు కాబట్టి ప్రతిఘటన లేదు. ఇప్పుడు జగన్‌పైనా అదే తరహా వ్యూహం పన్నారు.
జగన్ ఒకవేళ దాడిలో ప్రాణాలు కోల్పోయి ఉన్నా అది శ్రీనివాస్ చేసిన ఉన్మాదపు చర్యనా… లేక నిజంగానే పెద్దలు అమలు చేసిన హత్య పథకమా అన్నది స్పష్టత రాకుండా ఉండేది.