జగన్ పై కుట్రే.... శివాజీని పట్టుకురావాలి.... డీజీపీ చెంచాలా మారారు....
వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికి హత్యాయత్నమే అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. దాడి వెనుక ఉద్దేశం ఏంటి, ఎవరున్నారు అన్నది తేల్చకుండా డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీ కార్యకర్తలా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కత్తి చిన్నదైనా… అనుకున్నట్టే దాడి చేసి ఉంటే జగన్ చనిపోయేవాడని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. మెడ మీద కీలకమైన నరం ఉంటుందని దాన్ని గానీ కోసి ఉంటే చనిపోయేవాడన్నారు. అదృష్టవశాత్తు జగన్ పక్కకు తప్పుకోవడంతో వేటు భుజంపై పడిందన్నారు. 1996లోనూ తనపై ఇదే తరహాలో […]
వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికి హత్యాయత్నమే అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. దాడి వెనుక ఉద్దేశం ఏంటి, ఎవరున్నారు అన్నది తేల్చకుండా డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీ కార్యకర్తలా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కత్తి చిన్నదైనా… అనుకున్నట్టే దాడి చేసి ఉంటే జగన్ చనిపోయేవాడని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు.
మెడ మీద కీలకమైన నరం ఉంటుందని దాన్ని గానీ కోసి ఉంటే చనిపోయేవాడన్నారు. అదృష్టవశాత్తు జగన్ పక్కకు తప్పుకోవడంతో వేటు భుజంపై పడిందన్నారు. 1996లోనూ తనపై ఇదే తరహాలో దాడి జరిగిందన్నారు. జగన్‌పై వాడిన కత్తి కంటే చిన్న కత్తితోనే దాడిచేసి తన గొంతుకోశారని గాయం తాలూకు ఆనవాళ్లను హర్షకుమార్ చూపించారు. జగన్‌పై దాడికి వాడిన కత్తి చాలా పదునుగా ఉందన్నారు. కోడి పందాల్లో కోడి ఎగిరి తంతే అవతలి కోడి తలే తెగిపోతుందన్నారు. అలాంటి కత్తితో ఒక వ్యక్తి జగన్‌పై దాడి చేస్తే … దర్యాప్తు చేయడం వదిలేసి ఇష్టమొచ్చినట్టు డీజీపీ, ముఖ్యమంత్రి మాట్లాడడం దారుణమన్నారు.
జగన్‌పై దాడి తర్వాత చంద్రబాబు ప్రెస్‌మీట్ చూస్తే అసహ్యం వేసిందన్నారు. ఎందుకు చంద్రబాబు అంత అసహనానికి గురవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. దాడిని ఖండించిన వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం కుసంస్కారమన్నారు. ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు ఏడవడం ఒకటే తక్కువగా కనిపించిందన్నారు. అసలు చంద్రబాబు తీరు చూస్తుంటే ఆయనకు ఏదైనా ఆవహించిందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
డీజీపీ చంద్రబాబుకు చెంచాలా పనిచేస్తున్నారని హర్షకుమార్ ఫైర్ అయ్యారు. డీజీపీ, అందరూ పచ్చచొక్కాలేసుకుని పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఇప్పటికే చంద్రబాబు పాలనతో భయంకరంగా నాశనం అయిపోతోందన్నారు. చంద్రబాబు పద్దతి చాలా అసహ్యంగా ఉందన్నారు. సినిమాలో విలన్ తరహాలో, హిట్లర్ తరహాలో చంద్రబాబు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
నిజంగా ఆపరేషన్ గరుడ ఉంటే శివాజీని పట్టుకొచ్చి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారించడం లేదని హర్షకుమార్ ప్రశ్నించారు. డీజీపీ టీడీపీ కార్యకర్త తరహాలో మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.