ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ బోణీ

తొలిరౌండ్లో ఒమన్ పై 11-0 గోల్స్ తో భారత్ విజయం దిల్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ ఆరు ఫీల్డ్ గోల్స్, ఐదు పెనాల్టీ కార్నర్ గోల్స్ 2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో… డిఫెండింగ్ చాంపియన్ భారత్… తొలిగెలుపుతో శుభారంభం చేసింది. మస్కట్ వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో…. ఆతిథ్య ఒమాన్ ను భారత్ 11-0 గోల్స్ తో ఊదేసింది. ఆట మొదటి క్వార్టర్లో కనీసం ఒక్క గోలు చేయలేని భారత్… […]

Advertisement
Update:2018-10-19 12:50 IST
  • తొలిరౌండ్లో ఒమన్ పై 11-0 గోల్స్ తో భారత్ విజయం
  • దిల్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్
  • ఆరు ఫీల్డ్ గోల్స్, ఐదు పెనాల్టీ కార్నర్ గోల్స్

2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో… డిఫెండింగ్ చాంపియన్ భారత్… తొలిగెలుపుతో శుభారంభం చేసింది. మస్కట్ వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో…. ఆతిథ్య ఒమాన్ ను భారత్ 11-0 గోల్స్ తో ఊదేసింది.

ఆట మొదటి క్వార్టర్లో కనీసం ఒక్క గోలు చేయలేని భారత్… రెండో క్వార్టర్ నుంచి చెలరేగిపోయింది. ప్రత్యర్థి గోల్ పై ఏకంగా 28 సార్లు దాడులు చేసి… ఏకంగా 11 గోల్స్ సాధించింది. ఇందులో యువ ఆటగాడు దిల్ ప్రీత్ సింగ్… ఆట 41, 55, 57 నిముషాలలో గోల్స్ సాధించడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

భారత్ కు లభించిన.. మొత్తం ఎనిమిది పెనాల్టీ కార్నర్లలో ఐదుగోల్స్ గా మలుచుకోగలిగింది. మిగిలిన ఆరూ ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం.
భారత గోల్ స్కోరర్లలో హర్మన్ ప్రీత్, లలిత్ ఉపాధ్యాయ, నీలకంఠ శర్మ, మన్ దీప్ సింగ్, గురుజంత్ సింగ్, ఆకాశ్ దీప్ సింగ్, వరుణ్ కుమార్, చింగ్లెన్ సానా సింగ్ ఉన్నారు. శనివారం జరిగే రెండోరౌండ్ పోటీలో … చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది..

Tags:    
Advertisement

Similar News