టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాములు నాయక్ సస్పెన్షన్!
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి వాదులు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈసారి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కుదరకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో మంతనాలు జరపడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ అధిష్టానం ముందుగానే మేల్కొంది. రాములు నాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటన వెలువడింది. రాములు […]
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి వాదులు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈసారి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కుదరకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో మంతనాలు జరపడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ అధిష్టానం ముందుగానే మేల్కొంది. రాములు నాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటన వెలువడింది.
రాములు నాయక్ త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. టికెట్ రాదని తేలిపోవడంతో జిల్లాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు టీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నారు.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై అసంతృప్తితో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి 20 మంది కౌన్సిలర్‌లతో కలసి కాంగ్రెస్‌లో చేరనున్నారు. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం ఎంపిపి ఇందిర తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వెంకటస్వామి (కాకా) పెద్ద కుమారుడు, మాజీ మంత్రి జి.వినోద్ త్వరలో జరగనున్న రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
టీఆర్‌ఎస్ నేత కావేటి సమ్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, మహిళానేత కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు.