బాబు నెత్తిన మరో బాంబు పేల్చిన ఉండవల్లి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటూనే చంద్రబాబు ప్రభుత్వం ఒక కంపెనీతో 16వేల 600 కోట్ల రూపాయలకు ఎంవోయూ చేసుకుందని ఉండవల్లి వివరించారు. అసలు సున్నా పెట్టుబడి వ్యవసాయం అంటూనే 16వేల 600 కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ అంశంపై బెంగళూరుకు చెందిన ఒక ఎన్‌జీవో సంస్థ 45 పేజీల్లో సంచలన కథనాన్ని ప్రచురించిందని… ఆ కథనాన్ని మీడియాకు చూపించారు. జీరో […]
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటూనే చంద్రబాబు ప్రభుత్వం ఒక కంపెనీతో 16వేల 600 కోట్ల రూపాయలకు ఎంవోయూ చేసుకుందని ఉండవల్లి వివరించారు. అసలు సున్నా పెట్టుబడి వ్యవసాయం అంటూనే 16వేల 600 కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు.
ఈ అంశంపై బెంగళూరుకు చెందిన ఒక ఎన్‌జీవో సంస్థ 45 పేజీల్లో సంచలన కథనాన్ని ప్రచురించిందని… ఆ కథనాన్ని మీడియాకు చూపించారు. జీరో బడ్జెట్ వ్యవసాయం అంటూనే 16వేల 600 కోట్లకు ఎంవోయూ చేసుకోవడం చూసి సదరు ఎన్‌జీవో సంస్థ ఆశ్చర్యపోయిందన్నారు. దాంతో అసలు ఆ ఎంవోయూ ఏంటో ఇవ్వాలని సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే…. సెక్షన్ 8 నిబంధన ప్రకారం ఆర్‌టీఐ చట్టం ఈ అంశానికి వర్తించదంటూ ఏపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు ఉండవల్లి.
సదరు ఎన్‌జీవో సంస్థే రెండోసారి ఉన్నతాధికారులకు లేఖ రాయగా…. 16 వేల 600 కోట్ల అంశాన్ని మాత్రం అడగవద్దని…. ఇతర ఏ అంశాల గురించి అయినా వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సమాధానం వచ్చిందన్నారు. అసలు సున్నా పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం అంటూనే 16 వేల 600 కోట్ల ఒప్పందం జరిగితే ప్రశ్నించలేని స్థితికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చిందని ఉండవల్లి ఆవేదన చెందారు.
తాను ఇటీవల ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వద్దకు వెళ్లానని…. వారిలో కొందరికి మాత్రమే ఆవు పేడను మురగ బెట్టేందుకు డ్రమ్ములు ఇచ్చారని…. వాటి విలువ బయట నాలుగు వందలుగా ఉంటే ప్రభుత్వం మాత్రం నాలుగు వేలుగా చూపించిందని ఉండవల్లి వివరించారు.
తనది పారదర్శక పాలన అని చెప్పుకునే చంద్రబాబు జీరో బడ్జెట్ వ్యవసాయం పేరు చెప్పి ఒక కంపెనీతో 16 వేల 600 కోట్ల రూపాయల ఒప్పందం వెనుక అసలు నిజాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేవలం దేశ రక్షణకు సంబంధించిన అంశాలను మాత్రమే బయటపెట్టకూడదని చెబుతున్న ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 8…. ఈ ఒప్పందానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.