నాని సరసన హీరోయిన్ గా త్రిష ?
ఇటివలే కాలంలో బయోపిక్స్ తో పాటు రీమేక్స్ కూడా ఎక్కువ అయ్యాయి. అయితే ఈ నేపధ్యం లో ఇప్పుడు మరో తమిళ్ సినిమా తెలుగు లో రీమేక్ కానుంది. ఆ సినిమానే “96”. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా తమిళ్ లో ఘన విజయం సాధించింది. అక్కడ ఈ సినిమా హిట్ అయ్యింది అన్న విషయం తెలియగానే తెలుగు లో చాలా మంది నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కొందాం అని […]
;
ఇటివలే కాలంలో బయోపిక్స్ తో పాటు రీమేక్స్ కూడా ఎక్కువ అయ్యాయి. అయితే ఈ నేపధ్యం లో ఇప్పుడు మరో తమిళ్ సినిమా తెలుగు లో రీమేక్ కానుంది. ఆ సినిమానే “96”. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా తమిళ్ లో ఘన విజయం సాధించింది. అక్కడ ఈ సినిమా హిట్ అయ్యింది అన్న విషయం తెలియగానే తెలుగు లో చాలా మంది నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కొందాం అని చెప్పి లైన్ లో నిల్చున్నారు.
కానీ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కన్ను కూడా ఈ సినిమా పై పడింది. ఇప్పుడు ఇదే సినిమాని దిల్ రాజు తెలుగు లో తీయాలి అని భావిస్తున్నాడు. తెలుగు లో నానిని హీరో గా పెట్టి త్రిషనే హీరోయిన్ గా ఉంచి సినిమా తెరకేక్కించాలి అనేది దిల్ రాజు ప్లాన్. ఈ విషయం మీద ఇప్పటికే నానితో దిల్ రాజు చర్చలు కూడా జరిపాడు అంట. మరి హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యి సీనియర్ హీరోయిన్ గా మారిన త్రిష పక్కన నటించడానికి నాని ఓకే చెప్తాడో లేదో చూడాలి.