నాగార్జున అక్టోబర్ సెంటిమెంట్
కొన్ని సెంటిమెంట్స్ ను నాగార్జున బలంగా నమ్ముతాడు. అది సినిమా పరంగా కావొచ్చు. సినిమా వ్యక్తుల పరంగా కావొచ్చు. నాగార్జున సెంటిమెంట్ గా ఫీలయ్యాడంటే అది చాలా సందర్భాల్లో నిజం అవుతుంది. ఈసారి కూడా ఓ సరికొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చాడు నాగార్జున. అదే అక్టోబర్ సెంటిమెంట్. “అక్టోబర్ నాకు బాగా కలిసొచ్చింది. ఇదే నెలలో శివ సినిమా వచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇదే నెలలో నిన్నే పెళ్లాడతా రిలీజైంది. దానికి ఏకంగా […]
కొన్ని సెంటిమెంట్స్ ను నాగార్జున బలంగా నమ్ముతాడు. అది సినిమా పరంగా కావొచ్చు. సినిమా వ్యక్తుల పరంగా కావొచ్చు. నాగార్జున సెంటిమెంట్ గా ఫీలయ్యాడంటే అది చాలా సందర్భాల్లో నిజం అవుతుంది. ఈసారి కూడా ఓ సరికొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చాడు నాగార్జున. అదే అక్టోబర్ సెంటిమెంట్.
“అక్టోబర్ నాకు బాగా కలిసొచ్చింది. ఇదే నెలలో శివ సినిమా వచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇదే నెలలో నిన్నే పెళ్లాడతా రిలీజైంది. దానికి ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక ఇదే నెలలో మాస్ మూవీ అల్లరి అల్లుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఇదే నెలలో దేవదాస్ సక్సెస్ మీట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం”
ఇది నాగార్జున వాదన. ఇలా అక్టోబర్ సెంటిమెంట్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసిన నాగార్జున, ఆ జాబితాలో దేవదాస్ చిత్రాన్ని చేర్చడం మాత్రం అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఇదొక ఫ్లాప్ సినిమా. షేర్ వాల్యూ బయటపెడితే పరువు పోతుందని భయపడి, ఏకంగా గ్రాస్ కలెక్షన్ రిలీజ్ చేసి బాజాలు కొట్టుకుంటున్నారు. అలాంటి సినిమాను శివ, నిన్నే పెళ్లాడతా సినిమాల సరసన నిలబెట్టాడు నాగ్.
అక్కినేని అభిమానుల్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఇబ్బంది పెడుతోంది ఈ అంశం. సెంటమెంట్ వరకు నాగార్జున చెప్పిన మేటర్ లో లాజిక్ ఉంది. కానీ సెప్టెంబర్ లో రిలీజైన దేవదాస్ చిత్రాన్ని బలవంతంగా అక్టోబర్ కు ముడిపెడుతూ దానికి సెంటిమెంట్ పులమడం మాత్రం బాగాలేదు.