"ఐ మెయింటెయిన్ విశ్వసనీయత".... హైదరాబాద్‌ వదిలి వెళ్లాలన్నప్పుడు బాధపడ్డా....

”చంద్రబాబూ…. గతంలో ఒక సారి తెలంగాణ దెబ్బ తగిలితే ఎగిరి విజయవాడ కరకట్ట మీద పడ్డావ్‌…. మళ్లీ కెలుకుతున్నావ్‌. నేను మూడో కన్ను తెరిస్తే ఏమవుతావో ఆలోచించుకో…. జాగ్రత్త” అంటూ నల్లగొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరన్నారు. జీవితంలో ”ఐ మెయింటెయిన్ విశ్వసనీయత” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోడీని చూస్తే తానెందుకు భయపడుతానని ప్రశ్నించారు. చంద్రబాబు మరో ఆసక్తికరమైన […]

Advertisement
Update:2018-10-05 03:50 IST

”చంద్రబాబూ…. గతంలో ఒక సారి తెలంగాణ దెబ్బ తగిలితే ఎగిరి విజయవాడ కరకట్ట మీద పడ్డావ్‌…. మళ్లీ కెలుకుతున్నావ్‌. నేను మూడో కన్ను తెరిస్తే ఏమవుతావో ఆలోచించుకో…. జాగ్రత్త” అంటూ నల్లగొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

కేసీఆర్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరన్నారు. జీవితంలో ”ఐ మెయింటెయిన్ విశ్వసనీయత” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోడీని చూస్తే తానెందుకు భయపడుతానని ప్రశ్నించారు.

చంద్రబాబు మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. ”రెండు రాష్ట్రాలకు తగవు వద్దంటే అక్కడి సీఎం(కేసీఆర్‌) వినడం లేదు. హైదరాబాద్‌ను వదిలి వెళ్లాలన్నప్పుడు అందరి కంటే ఎక్కువ బాధపడ్డా. కానీ వాళ్లూ నా తెలుగువాళ్ళే అన్న కారణంతో వచ్చేశా” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అయితే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి వెళ్లాల్సిందిగా చంద్రబాబుకు ఎవరు చెప్పారు? ఆయన అలా ఎందుకు హైదరాబాద్‌ను వదిలి వచ్చారు? అన్నది చర్చనీయాంశంగా ఉంది.

కేసీఆర్‌ తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా అని బాబు నిలదీశారు. తెలంగాణ కోసమే బాబ్లీ ప్రాజెక్టుపై ఉద్యమం చేశానన్నారు. బీజేపీ డైరెక్షన్‌లోనే జగన్‌, కేసీఆర్, పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News