21 లోక్‌సభ స్థానాలు వైసీపీవే " సీ ఓటర్స్ సర్వే

లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ప్రముఖ జాతీయ టీవీ చానల్‌ రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్స్ సంస్థ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వరకు లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయబోతోందని సర్వే వెల్లడించింది. ఏపీలో 25 ఎంపీ స్థానాలుండగా ఏకంగా 21 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్స్‌ సర్వే వెల్లడించింది. 2014లో బీజేపీతో […]

Advertisement
Update:2018-10-04 13:42 IST

లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ప్రముఖ జాతీయ టీవీ చానల్‌ రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్స్ సంస్థ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వరకు లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయబోతోందని సర్వే వెల్లడించింది.

ఏపీలో 25 ఎంపీ స్థానాలుండగా ఏకంగా 21 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్స్‌ సర్వే వెల్లడించింది. 2014లో బీజేపీతో పొత్తు వల్ల 15 స్థానాలు సొంతం చేసుకున్న టీడీపీ ఈసారి మాత్రం కేవలం నాలుగు లోక్‌సభ స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంటుందని సర్వే తేల్చింది.

బీజేపీ, కాంగ్రెస్‌లు లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం లేదని వెల్లడించింది. ఓట్ల శాతం పరంగానూ టీడీపీ భారీగా నష్టపోయింది. 2014లో 40. 8 శాతం ఓట్లు సాధించిన టీడీపీ ఈసారి 31. 49 శాతానికి పడిపోయింది.

వైసీపీ ఓట్ల శాతం కూడా 45.4 నుంచి 41.9 శాతానికి తగ్గింది. ఏపీలో ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌, బీజేపీ గెలుచుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఓట్ల శాతం మాత్రం ఆ రెండు పార్టీలకు పెరిగినట్టు సర్వే వివరించింది.

వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ కాకుండా ఇతర పార్టీలకు ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే వివరించింది.

అయితే ఈ సర్వే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినది అని…. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితులు మరోలా ఉండవచ్చని అభిప్రాయపడింది.

మొత్తం మీద ఈ సర్వే బట్టి టీడీపీ చాలా నష్టపోయినట్టు అర్థమవుతోంది. వైసీపీ ఏకంగా 21 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని సర్వే చెప్పడం ఇది ఆ పార్టీకి ఊపునిచ్చేదే.

Tags:    
Advertisement

Similar News