బాబుకు భద్రత మరింత కట్టుదిట్టం....

మావోయిస్టుల దాడులు, ఎన్నికల తరుణం కావడంతో వీవీఐపీల భద్రతను మరింత పెంచుతున్నారు. ఈజాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు. ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో వీవీఐపీల భద్రతను కేంద్ర హోం శాఖ అప్‌గ్రేడ్ చేసింది. ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న వారి భద్రతకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. బ్లాక్ క్యాట్ కమాండోల సంఖ్యను పెంచబోతున్నారు. కమోండోలకు మరింత మెరుగైన శిక్షణ, సూచనలు ఇస్తున్నారు. ముప్పు ఉన్న ముఖ్యమంత్రుల జాతితాలో చంద్రబాబు, […]

Advertisement
Update:2018-10-01 05:08 IST

మావోయిస్టుల దాడులు, ఎన్నికల తరుణం కావడంతో వీవీఐపీల భద్రతను మరింత పెంచుతున్నారు. ఈజాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు. ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో వీవీఐపీల భద్రతను కేంద్ర హోం శాఖ అప్‌గ్రేడ్ చేసింది.

ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న వారి భద్రతకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. బ్లాక్ క్యాట్ కమాండోల సంఖ్యను పెంచబోతున్నారు. కమోండోలకు మరింత మెరుగైన శిక్షణ, సూచనలు ఇస్తున్నారు. ముప్పు ఉన్న ముఖ్యమంత్రుల జాతితాలో చంద్రబాబు, రమణ్‌ సింగ్, మోడీ, ఆదిత్యనాథ్ ఉండగా…. వారికి ఇకపై ఎస్పీజీ మరింత పకడ్బంధీగా భద్రత ఇవ్వనుంది.

వీఐపీలపై దాడి జరిగితే కమాండోలు రెండు విభాగాలుగా పని నిర్వహిస్తున్నారు. ఒక బృందం వీవీఐపీని సురక్షింగా తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంటుంది. మరో బృందం దాడి చేస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తుంది. దాడి సమయంలో ఎవరు ఏపని చేయాలన్న దానిపై ఎస్పీజీ కమాండోలకు ముందే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో పాటు ముఖ్యమంత్రుల బాధ్యతను చూస్తున్న ఎస్పీజీ బృందాలకు మరింత ఆధునాతన ఆయుధాలు, పరికరాలు అందజేయనున్నారు.

చంద్రబాబు వరకు చూస్తే ఇప్పటికే ఆయనకు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. ఆయన చుట్టూ నిత్యం వందలాది మంది పోలీసులు మోహరించి ఉంటారు. చంద్రబాబు జిల్లా పర్యటన సమయంలో వేలాది మంది పోలీసులతో పర్యటనకు భద్రత కల్పిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పల్ప దూరం కూడా హెలికాప్టర్‌ లోనే ప్రయాణిస్తున్నారు. రోడ్డు మార్గంలో ఆయన చాలా అరుదుగా ప్రయాణిస్తున్నారు. చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఎక్కువగా పర్యటనలు చేస్తుండడం వల్ల…. ఆయన భద్రత కోసమే పేద రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌…. అతి ఎక్కువ డబ్బును ఖర్చుపెట్టాల్సి వస్తోంది.

Advertisement

Similar News