ఓటుకు నోటు.... అమరావతి నుంచి సూచనలు....
ఓటుకు నోటు కేసులో నిందితుల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులతో అమరావతిలో టీడీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ ఆస్తులపై ఓటుకు నోటు కేసు మూలంగానే దాడులు జరుగుతున్నట్టు నిర్ధారణ కావడంతో టీడీపీ పెద్దలు తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై ఆందోళనతో ఉన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు కూడా ఆడియో టేపులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం, తాజాగా జరిగిన సోదాల్లో మరో మూడు ఆడియో టేపులు […]
ఓటుకు నోటు కేసులో నిందితుల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులతో అమరావతిలో టీడీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ ఆస్తులపై ఓటుకు నోటు కేసు మూలంగానే దాడులు జరుగుతున్నట్టు నిర్ధారణ కావడంతో టీడీపీ పెద్దలు తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై ఆందోళనతో ఉన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు కూడా ఆడియో టేపులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం, తాజాగా జరిగిన సోదాల్లో మరో మూడు ఆడియో టేపులు బయటకు రావడంతో అమరావతిలో ఉత్కంఠగా మారింది. ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా , పరోక్షంగా సంబంధాలున్న వారికి అప్పుడే అమరావతి నుంచి సూచనలు వెళ్లినట్టు చెబుతున్నారు.
ఓటుకు నోటు కేసులో న్యాయపరంగా పట్టు ఉన్న కొందరు టీడీపీ నేతలు రంగంలోకి దిగి…. ఓటుకు నోటు టీంకు స్పష్టమైన ముందు జాగ్రత్తలు వివరించారు. హైదరాబాద్ వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఓటుకు నోటు వ్యవహారంలోని పాత్రధారులకు సూచనలు చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కొందరిని ఆంధ్రప్రదేశ్ వచ్చి… టీడీపీ పెద్దల వద్ద ఆశ్రయం పొందాల్సిందిగా సూచించారు. అయితే ఈ వ్యవహారం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే సంబంధించినది కావడంతో టీడీపీ నేతలెవ్వరూ స్పందించకుండా మీడియాకు దూరంగా ఉంటున్నారు.