ఫ్యామిలీ మొత్తం రండి.... రేవంత్‌కు ఐటీ అధికారుల ఆదేశం
ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఓటుకు నోటు వ్యవహారంలో మళ్లీ కదలిక వచ్చింది. ఉదయం ఐటీ, ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉన్నారు. సోదాలు ముగిసిన తర్వాత ఐటీ అధికారులు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. వెంటనే హైదరాబాద్ […]
ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఓటుకు నోటు వ్యవహారంలో మళ్లీ కదలిక వచ్చింది. ఉదయం ఐటీ, ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉన్నారు. సోదాలు ముగిసిన తర్వాత ఐటీ అధికారులు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. వెంటనే హైదరాబాద్ వచ్చి తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.
ఒక్కరే కాకుండా కుటుంబసభ్యులతో కలిసి రావాల్సిందిగా అధికారులు ఫోన్‌లో ఆదేశించారు. దీంతో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి బయలుదేరారు. ఓటుకు నోటు కేసులోనే ఈ సోదాలు జరిగాయి. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వాడిన 50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తేవాలనుకున్నారన్న దానిపై ఈడీ, ఐటీ తీగ లాగుతోంది.