కాకుల కోసం ప్రత్యేక పార్క్
అంతరించిపోతున్న కాకులను సంరక్షించేందుకు మధ్యప్రదేశ్‌లో ముక్తిధామ్ సేవా సమితి అనే సంస్థ ముందుకు వచ్చింది. కాకుల కోసం ప్రత్యేకంగా ఓ పార్కును ప్రారంభించింది. ఈ పార్కులో కాకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆహారం, మంచినీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. కాకుల రక్షణకు కొందరు యువకులు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. వారంతా కలిసి ప్రతి రోజూ పార్కుకు వచ్చి కాకులకు ఆహారం అందిస్తున్నారు. మతపరంగానే కాకుండా.. కాకుల రక్షణ సైంటిఫిక్‌గా కూడా ఎంతో మంచిదని […]
అంతరించిపోతున్న కాకులను సంరక్షించేందుకు మధ్యప్రదేశ్‌లో ముక్తిధామ్ సేవా సమితి అనే సంస్థ ముందుకు వచ్చింది. కాకుల కోసం ప్రత్యేకంగా ఓ పార్కును ప్రారంభించింది. ఈ పార్కులో కాకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆహారం, మంచినీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు.
కాకుల రక్షణకు కొందరు యువకులు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. వారంతా కలిసి ప్రతి రోజూ పార్కుకు వచ్చి కాకులకు ఆహారం అందిస్తున్నారు. మతపరంగానే కాకుండా.. కాకుల రక్షణ సైంటిఫిక్‌గా కూడా ఎంతో మంచిదని నిర్వాహకులు చెబుతున్నారు. హిందూ మతం ప్రకారం కాకులను పూర్వీకుల చిహ్నంగా భావిస్తామని … వాటిని కాపాడడం ఎంతో గొప్ప పనిగా భావిస్తామని విదిశ మున్సిపల్ కౌన్సిలర్ దినేశ్ కుశ్వాహా తెలిపారు.
ఇటీవలే హైదరాబాద్‌లో కుక్కల కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి విశాలమైన ప్రాంగణంలో కుక్కుల కోసం ఆధునిక సదుపాయాలతో కొందరు ఔత్సాహికులు డాగ్ పార్క్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కాకుల పార్క్ ఏర్పాటయింది. వీరిని ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి పార్కులు ఏర్పాటు కానున్నాయో వేచిచూడాలి.