కన్నడ సినిమా నుంచి తప్పుకున్న రష్మిక

తెలుగులో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఆటోమేటిగ్గా ఆమె రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. ఇలాంటి టైమ్ లో పెద్దగా మార్కెట్ లేని కన్నడలో సినిమా చేయడం అవివేకం. అందుకే గతంలో అంగీకరించిన ఓ కన్నడ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది రష్మిక. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. “ఈ సందర్భంగా అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. వ్రిత్రా అనే సినిమాలో ఇకపై నేను భాగం కాను. నా కెరీర్ ప్రారంభంలో తీసుకున్న ఓ మంచి నిర్ణయంగా దీన్ని నేను భావిస్తున్నాను. […]

Advertisement
Update:2018-09-17 14:28 IST

తెలుగులో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఆటోమేటిగ్గా ఆమె రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. ఇలాంటి టైమ్ లో పెద్దగా మార్కెట్ లేని కన్నడలో సినిమా చేయడం అవివేకం. అందుకే గతంలో అంగీకరించిన ఓ కన్నడ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది రష్మిక. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

“ఈ సందర్భంగా అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. వ్రిత్రా అనే సినిమాలో ఇకపై నేను భాగం కాను. నా కెరీర్ ప్రారంభంలో తీసుకున్న ఓ మంచి నిర్ణయంగా దీన్ని నేను భావిస్తున్నాను. చాలా రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకొని, ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పాను. అతడు నన్ను అర్థం చేసుకున్నాడు. నేను తప్పుకున్న పాత్రను కచ్చితంగా ఎవరో ఒకరు భర్తీచేస్తారు. దానికి న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. దర్శకుడు గౌతమ్ తో పాటు యూనిట్ కు శుభాకాంక్షలు”

ఇలా తను తప్పుకుంటున్న విషయాన్ని ట్విట్టర్ లో ఎనౌన్స్ చేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక నిర్ణయంపై కోలీవుడ్ జనాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలుగులో క్రేజ్ ఉంటే అక్కడే కొనసాగాలని, క్రేజ్ తగ్గిన తర్వాత కూడా కన్నడ చిత్రపరిశ్రమకు రావొద్దంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News