బాబు జమానాలో హత్యాయత్నం.. ఇప్పుడు తిరగదోడాలంటున్న గద్దర్!
ప్రజా యుద్ధనౌక గద్దర్.. తనపై దాదాపు 20 ఏళ్ల కింద జరిగిన హత్యాయత్నాన్ని తిరగదోడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ కేసులో నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారని.. కాబట్టి వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ అనురాగ్ శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. 1997లో అంటే 19 ఏళ్ల క్రితం అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి కొందరు సాయుధులు వచ్చారు. గద్దర్‌ను ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చి తుపాకులతో కాల్చారు. తమను తాము గ్రీన్ టైగర్స్‌గా […]
Advertisement
ప్రజా యుద్ధనౌక గద్దర్.. తనపై దాదాపు 20 ఏళ్ల కింద జరిగిన హత్యాయత్నాన్ని తిరగదోడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ కేసులో నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారని.. కాబట్టి వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ అనురాగ్ శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. 1997లో అంటే 19 ఏళ్ల క్రితం అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి కొందరు సాయుధులు వచ్చారు. గద్దర్‌ను ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చి తుపాకులతో కాల్చారు. తమను తాము గ్రీన్ టైగర్స్‌గా చెప్పుకున్న ఈ బృంద సభ్యులు ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీనే! అయితే ఈ కాల్పులకు పాల్పడింది నయీమ్ ముఠానేనని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అప్పటి డీజీపీ హెచ్.జె.దొర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. అయితే.. ఈ హత్యాయత్నం నయీం మనుషులే చేశారని గద్దర్ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఈకేసులో నిందితులను పట్టుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని వాదిస్తున్నారు.
1994 తరువాత గ్రీన్ కోబ్రా, గ్రీన్ టైగర్స్ పేరిట కొన్ని బృందాలు మాజీ మావోయిస్టులను, మావోయిస్టు సానుభూతి పరులను కాల్చిచంపేవి. మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు నయీంనే ఇలా వాడుకున్న విషయం ప్రస్తుతం వెలుగుచూసింది. అతని ద్వారా చాలామంది మావోయిస్టులను అప్పటి ప్రభుత్వాలు, పోలీసులే చంపించాయన్న విషయాలు ఇప్పుడు లోకానికి తెలియడంతో మరోసారి గద్దర్‌పై జరిగిన హత్యాయత్నం తెరపైకి వచ్చింది. మాజీ మావోయిస్టులు బెల్లి లలిత, ఈదన్న, పౌరహక్కుల నేతలు పురుషోత్తమ్ తదితరులను చంపింది నయీమేనని లోకానికి తెలిసినా చంపించింది పోలీసులు కాబట్టి అతన్ని పట్టుకోలేదు. మావోయిస్టుల హత్యలపై పౌరహక్కుల నేతలు అప్పటి సీఎం చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. అదే పోలీసుల చేతిలో నయీం హతమయ్యాడు. పోలీసులకు నయీంతో ఉన్న అక్రమ లావాదేవీలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కాబట్టి, తన హత్యాయత్నం వెనక ఉన్న కుట్రదారులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజాగాయకుడు గద్దర్.
Advertisement