"స్టే" హైకోర్టులో బాబు గట్టి ఎదురుదెబ్బ

హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని కోసం చంద్రబాబు ఎంచుకున్న స్విస్‌ చాలెంజ్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. సింగపూర్ కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా, చాలెంజ్ విధివిధానాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్‌, చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుధీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు చివరకు స్విస్‌ చాలెంజ్‌పై స్టే విధించింది. అసలు పిటిషన్లకు అర్హత లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు […]

Advertisement
Update:2016-09-12 05:21 IST

హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని కోసం చంద్రబాబు ఎంచుకున్న స్విస్‌ చాలెంజ్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. సింగపూర్ కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా, చాలెంజ్ విధివిధానాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్‌, చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుధీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు చివరకు స్విస్‌ చాలెంజ్‌పై స్టే విధించింది. అసలు పిటిషన్లకు అర్హత లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లకు విచారణార్హత ఉందని తేల్చిచెప్పింది. స్విస్ చాలెంజ్ పై స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News